డ్రైవర్ అవతారమెత్తిన బాలకృష్ణ

Sunday, September 14th, 2014, 09:49:25 AM IST


అనంతపురం జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికుల విరాళాలతో కొనుగోలు చేసిన నాలుగు సూపర్ లగ్జరీ బస్సులను, ఒక పల్లెవెలుగు బస్సుతో పాటు నూతన హంగులతో తీర్చిదిద్దిన మరో పది బస్సులను ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు ప్రారంభించారు. అంతేకాకుండా బాలకృష్ణ ఒక బస్సును కూడా నడిపాడు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు.. అనంతపురం ఆర్టీసీ రీజినల్ మేనేజర్, పలుగురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.