బాలయ్యకు అభయమిచ్చిన కేసీఆర్..!!

Tuesday, February 14th, 2017, 03:50:57 PM IST


సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో చేపట్టిన నిర్మాణాలను బిల్డింగ్ రెగులైజేషన్ స్కీమ్(బిఆర్ఎస్) కింద క్రమబద్దీకరించాలని బాలయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరారు.

బాలయ్య అభ్యర్థనకు కేసీఆర్ సానుకూలంగా స్పదించినట్లు తెలుస్తోంది. బసవతారకం ఆసుపత్రి సేవాదృక్పథంతో రోగులను ఆదుకుంటున్నందున దానిపట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ బాలయ్యతో అన్నారు. గతంలో కూడా బాలయ్య ఈ విషయమై కేసీఆర్ తో భేటీ అయ్యారు. కాగా తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ కింద నగరంలోని భవనాలను క్రమబద్దీకరిస్తోంది. ఆ వెసులుబాటుని బసవతారకం ఆసుపత్రికి కల్పించి, ఆసుపత్రి ఆవరణం లో నైట్ షెల్టర్ ల సంఖ్యా పెంచాలని బాలయ్య ముఖ్యమంత్రిని కోరారు.