ఆంధ్రా కింగ్ నేనే అంటున్న బాలయ్య ?

Thursday, June 14th, 2018, 10:05:45 PM IST


నందమూరి బాలకృష్ణ హీరోగా నటించే తాజా చిత్రానికి ఆంధ్రా కింగ్ 47 అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు ఇంకాస్త టైం పట్టేలా ఉండడంతో బాలయ్య మాస్ దర్శకుడు వినాయక్ తో సినిమాకు ఓకే చెప్పాడు. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ కావొచ్చాయి. జులై లో ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకు ఏకే 47 అనే టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఏకే 47 అంటే ఆంధ్రా కింగ్ అని టాక్. మరి ఈ టైటిల్ విషయంలో దర్శకుడి అభిప్రాయాన్ని బాలయ్య ఏకీభవిస్తాడో లేదో చూడాలి. మరి బాలయ్య ఆంధ్రా కింగ్ అంటే తెలంగాణాలో ఎలాంటి రియాక్షన్ ఉంటుందో మరి.