నాగబాబు తరహాలోనే బాలయ్య రియాక్షన్ ఉండబోతోందా..?

Saturday, January 12th, 2019, 05:35:22 PM IST

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా నాగ‌బాబు, బాల‌కృష్ణ‌ల మ‌ధ్య జ‌రుగుతున్న మాటల యుద్ధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది అనేలా, ఇక్క‌డ వేయ‌కుండానే భ‌గ్గుమంటుంది. కావాల‌నే కొన్ని రోజుల నుంచి నాగబాబు బాలయ్యను డిస్ట‌ర్బ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ విష‌యంలో బాల‌య్య మాత్రం విచిత్రంగా ఏమీ స్పందించ‌కుండా ఉన్నాడు. అస‌లు ఎందుకు ఇంత‌గా బాల‌య్య ఏ మాత్రం స్పందించకుండా ఎలా ఉన్నాడో తెలియ‌క అభిమానులు కూడా కన్ఫ్యూజన్ లో ప‌డిపోయారు. నాగబాబు బాలయ్యల వార్ కాస్త నందమూరి, మెగాఫ్యాన్స్ మధ్య వార్ లా మారే స్థాయికి చేరింది, అయితే ఇన్నాళ్ళ‌కు నాగ‌బాబు వివాదంపై నోరు విప్పాడు బాలకృష్ణ.

బాలకృష్ణ ప్ర‌స్తుతం “ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు” సినిమా ప్ర‌మోష‌న్ తో బిజీగా ఉన్నారు, నాగ‌బాబు విష‌యంపై కూడా మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. తాను ఇప్పుడు సినిమా ప్ర‌మోష‌న్ లో ఉన్నాన‌ని, ఇలాంటి స‌మ‌యంలో అన్ని విష‌యాల‌పై మాట్లాడ‌నంటూ నాగ‌బాబు వివాదాన్ని తీసి పక్కన పడేసాడు . అస‌లు ఈ ఇష్యూ ఏమీ జ‌ర‌గ‌న‌ట్లు.. జ‌రిగినా కూడా ఏమీ తెలియ‌న‌ట్లు ఉన్నాడు. నాగ‌బాబు గురించి గుచ్చి గుచ్చి మీడియా అడుగుతున్నా కూడా సింపుల్ గా స‌మాధానం దాటేసాడు బాల‌య్య‌. ఈయ‌న ప్లాన్ కూడా మ‌రోలా ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది, త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై పూర్తిగా మాట్లాడాల‌ని చూస్తున్నాడు బాల‌య్య‌. అందుకే ఇన్నాళ్ల నుంచి ఇంత సెన్సేష‌న్ అవుతున్నా కూడా ఏం మాట్లాడ‌కుండా న‌వ్వుతూ స‌మాధాన‌మిస్తున్నాడు బాల‌కృష్ణ‌. మొత్తానికి ఏ విషయమైనా ముక్కుసూటిగా, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే బాలయ్య, ఈ వివాదంపై స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.