బావ కోసం ఈ రూట్లో ఎందుకు బాలయ్య..?

Tuesday, December 5th, 2017, 11:55:33 PM IST

హిందూపురం ఎమ్మెల్యే గా బాలయ్య భాద్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. బాలయ్య ఎమ్మెల్యే అనే కానీ పార్టీ కార్యక్రమాలు చూసుకోవలసిన అవసరం లేదు. ఎందుకేనట చంద్రబాబే పార్టీని వన్ మాన్ ఆర్మీగా నడిపించేయగలరు. కానీ ప్రజాప్రతినిధిగా బాలయ్యకు కొన్ని భాద్యతలు మాత్రం ఉన్నాయి. ఈ ప్రస్తావన ఎందుకంటే బాలకృష్ణ చంద్రబాబు కోసం అసలైన రూట్ వదిలేసి వేరే రూట్ లో కష్టపడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ, బోయపాటి సూపర్ హిట్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో మూవీ రాబోతోంది.

ఈ చిత్రంలో సమకాలీన రాజకీయ అంశాలని ప్రస్తావిస్తూ చంద్రబాబుకు ఫేవర్ గా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 నాటికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది ప్లాన్. సరిగ్గా అది ఎన్నికల సమయం కాబట్టి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథని దర్శకుడు బోయపాటి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ చిత్రంలో ప్రతి సన్నివేశం తెలుగుదేశం పార్టీకి క్రేజ్ తీసుకువచ్చేలా రూపొందించనున్నారట. ఈ విషయం అధికారికంగా బయటకు రాకున్నా టీడీపీ వర్గాలు లోలోపలే దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

బాలకృష్ణ మిగిలిన ఎమ్మెల్యేలందరిలో ప్రత్యేకం. సినీ నటుడు కాబట్టి బాలయ్యపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా తానేంటో బాలయ్య నిరూపించుకోవాలి. మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగానే బాలయ్య నియోజక వర్గ అభివృద్ధి కూడా అంతనంత మాత్రంగానే ఉండనే సెటైర్లు పడుతున్నాయి. పొలిటికల్ సినిమాలపై కాకుండా నియోజకవర్గం అభివృద్ధిపై ఫోకస్ పెడితే చంద్రబాబుకు, పార్టీకి ఉపయోగం ఉంటుందనేని టీడీపీ కార్యకర్తల అభిప్రాయం.

  •  
  •  
  •  
  •  

Comments