ఆయన పై బాలక్రిష్ణ వ్యాఖ్యలు సరైనవి కావు : పురంధేశ్వరి

Thursday, April 26th, 2018, 09:50:08 AM IST

గత కొద్దిరోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అధికార ప్రతిపక్షాలు సహా అన్ని పార్టీల నేతలు ఈ విషయమై గట్టిగా పోరాడుతున్నారు. మొన్న టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన హామీలు, హోదా ఇవ్వని కారణంగా ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన ఒక్కరోజు ధర్మ పోరాట దీక్షలో హిందూపూర్ ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఇటీవల ఆయన వ్యాఖ్యలను ఖండించిన సినీ నటుడు, బిజెపి నేత సాయి కుమార్, బాలయ్య ఆవేశం లో అలా మాట్లాడారని, ఆయనతరఫున మోడీకి తాను క్షమాపణలు చెపుతున్నాను అన్నారు. అలానే ఎలాగైనా మోడీ కాళ్ళమీద పడి హోదా ఇవ్వమని అడుగుతాను అన్నారు. అయితే నిన్న బాలయ్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల సందర్భంగా అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమె అక్కడి నేతలకు ప్రచార కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రజల మనసుతెలుసుకుని పాలన సాగించే నేతలు ఎప్పటికి విజయం సాధిస్తారని అన్నారు.

అంతే కాదు, కర్ణాటక ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ఇక బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆమె మాట్లాడుతూ, ఒక ఎమ్యెల్యే స్థాయి హోదా వున్న వ్యక్తి ఎంతో హుందాగా ప్రవర్తించాలేతప్ప ఇలా నీచమైన పదజాలంతో, అసభ్యకరంగా అదికూడా దేశ ముఖ్యమంత్రిని అనడం సరైనది కాదని, మోడీ ఏపీని ఎప్పుడు తక్కువగా చూడలేదని, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక మోడీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అన్నివిధాలా సహకరిస్తోందని, మరి టీడీపీ నేతలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో వారికే తెలియాలి అని అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments