టిడిపి నేతలకు బాలయ్య వార్నింగ్.. రిపీట్ అయ్యిందో..

Friday, June 8th, 2018, 11:14:01 PM IST

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎవరి నియోజకవర్గంలో వారు పరిస్థితి గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో చంద్రబాబు పరిస్థితి గురించి ఒక అవగాహనా తెచ్చుకొని వీలైనంత త్వరగా సెట్ చేసుకోవాలని ఆదేశాలను పంపారట. ఇక బాలకృష్ణ తన నియోజకవర్గమైన హిందూపురంలో పార్టీని పరిశీలించగా ఊహించని విషయాలు ఆయన దృష్టికి వచ్చాయి. లీడర్ల మధ్య వివాదాలు ఎక్కువగా రావడం బాలయ్యకు ఆగ్రహం తెప్పిచిందట. ఇక పద్ధతులు మార్చుకోకుంటే అస్సలు ఊరుకునేది లేదని కన్నెర్ర చేశారు. ఎక్కువగా చిలమత్తూరు మండలం నేతల మధ్య వివాదాలు చెలరేగినట్లు తెలుసుకున్న బాలయ్య అందరికి వార్నింగ్ ఇచ్చారు.

పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించగా ఈ నాలుగేళ్ల పాలనలో జరిగిన పనులు జరగాల్సిన పనుల గురించి బాలయ్యకు వివరించారు. అయితే కొందరు కార్యకర్తలు టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీ వెనుకుండి జెండా మోసిన తమకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని సర్పంచ్ – ఎంపిటీసీలే అభివృద్ధి పనులను పంచుకుంటున్నారు. తమ గురించి కొంచెం కూడా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు చెప్పడంతో బాలయ్య అందరిపై సీరియస్ అయ్యారు. ఇక నుంచి అన్ని వర్గాల వారిని పట్టించుకునే విధంగా మంచి కార్యక్రమాలను ప్రజలకు అందేలా చేస్తామని,.. ఇప్పటి వరకు జరిగింది మర్చిపోయి ఇక నుంచి నేతలు కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని అన్నారు. మళ్లీ మరోసారి వివాదాలు రాకుండా చూసుకోవాలని లేదంటే తన విశ్వరూపం చూడాల్సి ఉంటుందని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments