టీకాంగ్రెస్ మ్యానిఫెస్టోకే ఒక దిక్కు,దివాన లేదు వీరు మమ్మల్ని అనడం.!

Wednesday, October 17th, 2018, 04:06:27 PM IST

నిన్న తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విడుదల చేసిన మ్యానిఫెస్టో పట్ల టీకాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.కెసిఆర్ కి ఎప్పుడు గుర్తు రాని నిరుద్యోగ భృతి మరియు రైతుల యొక్క సమస్యలు ఇప్పుడు అకస్మాత్తుగా గుర్తుకొచ్చేసాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.ఇప్పుడు తెరాస వారు ప్రవేశ పెట్టినటువంటి ఎన్నికల మ్యానిఫెస్టో గత నెల నుంచి మేము చెప్తున్నా హామీలనే మక్కికి మక్కి కాపీ కొట్టేశారని టీకాంగ్రెస్ నేతలు అనేక విమర్శలు చేస్తున్నారు.

ఇప్పుడు వీరి యొక్క ఈ విమర్శలకు గాను తెరాస అభ్యర్థి బాల్క సుమన్ ఇప్పుడు వారికి దిమ్మతిరిగిపోయే కౌంటర్లు ఇస్తున్నారు.బడుగు బలహీన వర్గాలు అందరికి సమన్యాయ పాలన అందేలా కెసిఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోని తీర్చిదిద్దితే ఇప్పుడు దాన్ని టీకాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారని మండిపడ్డారు.మీ మ్యానిఫెస్టోకే ఒక సరైన దిక్కు దివానా లేదు కానీ,వీరి మ్యానిఫెస్టోని మేము కాపీ కొడుతున్నాం అంట అని మండిపడ్డారు.సరిగ్గా ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలో కూడా తెలీని దిక్కు తోచని పరిస్థిలో ఉన్న మీరు మమ్మల్ని అనడం ఒకటి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments