వైఎస్, చంద్రబాబులే కేసిఆర్ వెంట్రుక కూడ పీకలేకపొయ్యారు !

Sunday, September 30th, 2018, 11:15:37 AM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడులు కేసిఆర్ మోడీతో కలిసి కుట్ర పన్ని చేయించారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ కేసిఆర్ కులం వేల ఎకరాలు ఫామ్ హౌస్ లేదా అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఘాటైన పదజాలంతో సమాధానమిచ్చాడు.

నేనొక ఉస్మానియా పిహెడ్డి స్కాలర్ ని, సంస్కారం కలిగిన వ్యక్తిని అంటూనే బాల్క సుమన్ కొడకా రేవంత్ రెడ్డి నువ్వొక లోఫర్ గాడివి, థర్డ్ గ్రేడ్ ఫెలోవి, నీ మీద నేను స్పందించడమే ఎక్కువ, మూడడుగులు ఉండవు పొట్టోడా.. నువ్వేమన్నా పీకుడుగానివా, నువ్వొస్తే టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతుందా, కొడకా తాట తీస్తా ఏమనుకున్నావో, నన్ను నా పార్టీ వాళ్ళు ఆపుతున్నారు అంటూ ఇకపై తిరుగుతావా నువ్వు, చూస్కుందామా, వైఎస్, చంద్రబాబులే కేసిఆర్ వెంట్రుక కూడ పీకలేకపొయ్యారు నువ్వెంత అంటూ చెలరేగిపొయ్యారు.

ఎంతమాత్రం అధికారంలో ఉన్నా, తమ నాయకుడ్ని సపోర్ట్ చేసుకోవాలనుకున్నా బాల్క సుమన్ ఇంతలా మాట్లాడటం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాటలు వింటుంటే కేసిఆర్ మాట్లాడితే రేవంత్ స్థాయిని పెంచినట్టు ఉంటుందని, ఆవేశం కలిగిన ఈ యువ ఎంపీని ఎగదోసినట్టే అనిపిస్తోంది. ఇలాంటి చర్యల వలన తమపై ఉన్న దొరల పాలన అనే నిందను టిఆర్ఎస్ నేతలు కొద్దికొద్దిగా నిజం చేసేట్టు కనిపిస్తున్నారు.