ఏపీ లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్ !

Thursday, February 8th, 2018, 01:12:45 PM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కేటాయించిన బడ్జెట్లో ఆంధ్ర ప్రదేశ్ కు సరైన రీతిన కేటాయింపులు జరపకపోవడంతో ప్రతిపక్ష పార్టీ లు నేడు బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన, సిపిఐ పార్టీలు పలు సంఘాల నేతలు బంద్ లో పాల్గొంటున్నాయి. అలానే పలు ప్రైవేట్ కళాశాలు, పాఠశాలలు, ఉద్యోగ, వాణిజ్య సంస్థలు సైతం బంద్ కు తమ మద్దతు తెలిపాయి. ప్రతి జిల్లాలోనూ ఆర్టీసీ కూడా బస్సు లను ఎక్కడికక్కడే నిలుపుదల చేయడంతో ప్రజారవాణాకు కొంత మేర ఇబ్బందులు కలిగాయి. బంద్ నేపధ్యం లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రతి జిల్లా లోను గట్టి భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు ప్రభుత్వ అధికారులు, పోలీస్ లు చెపుతున్నారు. కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయం, అలానే విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా తక్షణమే నెరవేర్చాలని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా వరకు కుంటు పడిందని, చంద్రబాబు ప్రభుత్వం ఇకనయినా మేల్కొని కేంద్రం పై ఒత్తిడి తెచ్చి నిధులు విడుదల అయ్యేలా చూడాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి….