అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను : బండ్ల గణేష్

Friday, September 14th, 2018, 12:16:30 PM IST

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాజకీయాల్లో వ్యూహ రచనలను అమలు చేయడంలో సిద్దమైనట్లు తెలుస్తోంది. దానికి తోడు పార్టీలో చేరికలు కూడా ఎక్కువవుతుండడంతో పార్టీలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. నేడు ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో సినీ నటుడు, నిర్మాత, బిజినెస్ మెన్ బండ్ల గణేష్ అధికారికంగా పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ నిర్వహించిన ఈ మీటింగ్ లో ఆయన కండువా కప్పుకొని తెలంగాణ రాజకీయాల్లో బిజీ అవ్వడానికి సిద్ధమయ్యారు.

ఇక మీడియాతో మాట్లాడిన బండ్ల గణేష్ పార్టీలో చేరడానికి గల కారణాలను వివరించాడు.
‘చిన్నప్పటి నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. ఎంతో అభిమానం. నాకు రాజకీయాల్లోకి రావాలని అనిపించింది. రాహుల్ గాంధీ అంటే కూడా నాకు ఎంతో ఇష్టం. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రజలకు మంచి సేవ చేయడానికి అవకాశం దొరికిందని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అదే విధంగా పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయమని చెప్పినా తాను సిద్దమే అని టికెట్టు కోసం పార్టీలో పని చేయనని, పని చేసిన తరువాత పార్టీ పదవి ఇస్తే సంతోషమని
వివరించారు. ఇక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో చేరమని అడిగితే వెళతారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. నేను గంట గంటకు ఒక పార్టీ మారే వ్యక్తిని కాదని ముందు నుంచి నాకు రాజకీయ పరంగా కాంగ్రెస్ అంటే ఇష్టమని అందులోనే చేరానని బండ్ల గణేష్ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments