కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పవన్ ఫ్యాన్ బండ్ల!

Friday, September 14th, 2018, 08:48:32 AM IST

సినీ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి నిర్మాతగా మారి మంచి విజయాలను అందుకున్న బండ్ల గణేష్ ఇప్పుడు సరికొత్త అవతారం తో కనిపించబోతున్నాడు. గత కొంత కాలంగా ఆయన రాజకీయాల్లోకి రావడానికి కసరత్తులు చేస్తున్నట్లు సోషల్ మిడియలో అనేక వార్తలు వచ్చాయి. పవన్ జనసేన పార్టీతో కలిసే అవకాశం ఉన్నట్లు మిడియలో కూడా పలు రకాల వార్తలు వచ్చాయి. ఎందుకంటే బండ్ల గణేష్ కి పవన్ కి మధ్య మంచి స్నేహబంధం ఉంది. అయితే ఫైనల్ గా బండ్ల గణేష్ ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

నేడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి ఆయన సిద్ధమైనట్లు సమాచారం. తెలంగాణలోని షాద్ నగర్ లో మంచి పలుకుబడి ఉన్న బండ్ల గణేష్ కు కొన్ని సినిమా థియేటర్స్ అలాగే కోళ్ల ఫారంలు ఉన్నాయి. ఎగ్ బిజినెస్ లో తక్కువ కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయా ప్రస్థానాన్నీ మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో నేడు (శుక్రవారం) జరగనున్న కార్యక్రమంలో గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షాద్ నగర్ టికెట్ బండ్ల గణేష్ కి ఫిక్స్ అయినట్లు సమాచారం. ఆయనతో పాటు మరికొంత ప్రముఖులు ఇతర పార్టీల సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments