చంద్ర‌బాబు ఎఫెక్ట్.. బాబు గణేశా.. నీ ప‌ని గోవిందేనా..?

Thursday, November 15th, 2018, 03:45:46 AM IST

సినీ ప్ర‌పంచంలో ప‌వ‌ర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు వీర భ‌క్తుడు అయిన న‌టుడు బండ్ల గ‌ణేష్ ఇటీవ‌ల‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. దీంతో తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో.. రాజేంద్ర‌న‌గ‌ర్ నుండి తాను ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతాన‌ని, త‌న‌కు టిక్కెట్ క‌చ్ఛితంగా వ‌స్తుంద‌ని ఢంకా మోగించినట్లు చెప్పుకున్నారు బండ్ల గ‌ణేష్‌. అయితే ఇవేమి ప‌ట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం.. బండ్ల గ‌ణేష్‌కు షాక్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా కాంగ్రెస్ విడుద‌ల చేసిన రెండు జాబితాల్లోనూ బండ్ల గ‌ణేష్‌కు చోటు క‌ల్పించ‌లేదు. అయితే రాజేంద్ర‌న‌గ‌ర్ సీటు ప్ర‌స్తుతం పెండింగ్‌లో ఉన్నా బండ్ల గ‌ణేష్‌కు మాత్రం ద‌క్కే అవ‌కాశం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

ఇక అస‌లు విష‌యం ఏంటంటే.. గత ఎన్నికల్లో రాజేంద్రనగర్‌లోద గెలిచిన టీడీపీ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్.. ఆ త‌ర్వాన టీఆర్ఎస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌డు కాంగ్రెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి త‌న కొడుక్కు రాజేంద్ర‌న‌గ‌ర్ టిక్కెట్ ఇప్పించాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నింస్తోంది. మ‌రోవైపు టీడీపీ కూడా రాజేంద్ర‌న‌గ‌ర్ త‌మ‌కే ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. మ‌హాకూట‌మిలో ప్ర‌స్తుతం చంద్ర‌బాబు చ‌క్రం తిప్పుతున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో బండ్ల గ‌ణేష్ పేరు ప‌రిశీల‌నలోకి వ‌చ్చినా.. చంద్ర‌బాబు అడ్డుప‌డి ఒప్పుకోలేద‌ని, రాజేంద్ర‌న‌గ‌ర్ సీటు టీడీపీకి ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదు, బండ్ల గ‌ణేష్‌కు మాత్రం ఒప్పుకోమ‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం మ‌హాకూట‌మిలో చంద్ర‌బాబు మాటే చెల్లుతున్న నేప‌ధ్యంలో గ‌ణేష్ పేరును లిస్టులో చేర్చ‌లేద‌ని టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల న‌గారా మోగి న‌ప్ప‌టి నుండి జాత‌ర చేసిన బండ్ల గ‌ణేష్ ప‌రిస్థితి ఏంట‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.