బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సోష‌ల్ మీడియాలో కౌంట‌ర్లు..!

Saturday, October 20th, 2018, 06:04:35 PM IST

తెలంగాణ‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో పార్టీల‌న్నీ ప్ర‌చారాల‌తో హోరెత్తిస్తున్నాయి. ఇక‌ తాజాగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించారు. ఈ నేప‌ధ్యంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ఇక రాహుల్ స‌భ‌లో ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్.. కొన్ని ఆశ‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

రాహుల్ గాంధీ ప్ర‌ధాన మంత్రి అయ్యి తీరుతాడ‌ని.. ఆయ‌న పుట్టుక‌తోనే జెడ్ కేట‌గిరీ పుట్టినా.. ఏమాత్రం గ‌ర్వం లేద‌ని.. ఆయ‌న ఎలాంటి ప్ర‌తిఫ‌లాలు ఆశించి రాజ‌కీయాల్లోకి రాలేద‌ని.. దేశ ప్ర‌జ‌లు క‌ష్టాలు తీర్చ‌డానికే.. ఆయ‌న పూర్తిస్థాయి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు త‌ప్ప‌.. ప్ర‌ధాని ప‌ద‌వి కోసం రాలేద‌ని బండ్ల‌గ‌ణేష్ అన్నారు. సోనియా గాంధీ కూడా ఏనాడు ప‌ద‌వులు ఆశించ‌లేద‌ని గ‌ణేష్ తెలిపారు.

ఇక అంత‌టితో ఆగ‌ని గ‌ణేష్.. గాంధీ కుటుంబం దేశం కోస‌మే పుట్టింద‌ని.. మ‌న దేశం ప్ర‌స్తుతం ఈ స్థాయిలో ఉందంటే.. దానికి కారంణం గాంధీ కుటుంబమే అని.. దేశం కోసం గాంధీ కుటుంబం నుండి అనేక‌మంది ప్రాణాలు అర్పించార‌ని.. అయినా ఏనాడు ఆ కుంటుంబం ప్ర‌తిఫ‌లం ఆశించ‌లేద‌ని గ‌ణేష్ అన్నారు. ఇక చివ‌రిగా తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు మంచి రోజులు వ‌స్తాయ‌ని.. కేంద్రంలో కూడా త్వ‌ర‌లోనే అధికారం లోకి కాంగ్రెస్ వ‌స్తుంద‌ని జ్యోస్యం చెప్పారు బండ్ల గ‌ణేష్‌. దీంతో బండ్ల గ‌ణేష్ వ్యాఖ్య‌ల పై సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. బండ్ల గ‌ణేష్‌ మొన్న పార్టీలో చేరారు.. నేడు ఓవ‌ర్‌గా భ‌జ‌న చేస్తున్నార‌ని.. దాని వెనుక కార‌ణాలు, లాభాలు, మ‌త‌ల‌బులేంటో ఆయ‌న‌కే సోష‌ల్ తెలియాల‌ని.. మీడియాలో నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.