అద్దాలను పగలగొట్టింది బాంగ్లాదేశ్ కెప్టెన్?

Thursday, March 22nd, 2018, 12:14:09 AM IST

ఇటీవలే శ్రీలంకలో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌ ఎంతో రసవత్తరంగా సాగిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా శ్రీలంక బాంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ వివాదాస్పదం అయ్యింది. బాంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆ మ్యాచ్ లో కొంచెం మితిమీరి ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. శ్రీలంక బౌలర్ వరుసగా రెండో బాల్ ని కొంచెం హైట్ లో వేయడంతో బాంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ నో బాల్ అనుకున్నాడు. గ్రౌండ్ అవతల ఉన్న ప్లేయర్లు కూడా అలానే అనుకున్నారు. కానీ అంపైర్ నో బాల్ అని ప్రకటించకపోవడంతో వారికి ఆగ్రహం ఒక్కసారిగా ముంచుకొచ్చింది. ముఖ్యంగా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హాసన్ బ్యాట్స్ మెన్ ను వెనక్కి రమ్మనడం అంతానాటకీయంగా సాగింది.

తీవ్ర చర్చగా సాగిన అనంతరం బాంగ్లాదేశ్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. అయితే అంతటితో ఆగని ఆటగాళ్లు కొంచెం మితిమీరి ప్రవర్తించారు. డ్రెస్సింగ్ రూమ్ లో అద్దాలను పగులగొట్టారు. ఆ విషయం పై ఐసిసి కూడా వివరణ కోరింది. సిసి కెమెరాల ఆదారంగా చూడాలని అనుకున్నప్పటికీ సిసి కెమెరాలు పనిచేయలేదు. మరి ఆ ఘటనకు పాల్పడింది ఎవరు అనే సస్పెన్స్ కు లంక మీడియా వివరణ ఇచ్చింది. కెప్టెన్ షకీబ్ అద్దాలను పగులగొట్టినట్లు చెప్పింది. డ్రెస్సింగ్ రూమ్ లో పనిచేసే వర్కర్స్ ద్వారా ఆ విషయం తెలిసినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే వీడియో ఆధారం లేకపోతే షకీబ్ పై చర్యలు తీసుకుంటారా అనేది సందేహామే అనే టాక్ వస్తోంది.