బంగ్లాదేశ్ అరుదైన రికార్డ్ !

Friday, February 2nd, 2018, 06:25:09 PM IST

ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ జట్టు అరుదైన రికార్డు సృష్టించింది. శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 513 పరుగులు చేసిన బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డు సాధించింది. ఈ మొత్తం స్కోరులో ఒక్క పరుగు కూడా బై గా కానీ, లెగ్ బై గా కానీ లభించకపోవడం గమనార్హం. అంతేకాదు, టెస్టు క్రికెట్‌లో బంగ్లాకు ఇది ఐదో అత్యధిక స్కోరు కూడా అవుతుంది. ఇదివరకు 2014లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసిన స్కోరులో కూడా ఒక్క పరుగు కూడా బై, లైగ్ బై రూపంలో రాలేదు. మూడేళ్లపాటు భద్రంగా ఉన్న ఈ రికార్డును ఇప్పుడు బంగ్లాదేశ్ బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు 3 వికెట్ల నష్టానికి 504 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ కొద్దీలో డబుల్ సెంచరీ చేజార్చుకుని 196 పరుగుల వద్ద అవుటవగా, ధనంజయ డిసిల్వా 173 పరుగులు చేశాడు. రోషన్ సిల్వా 173 బంతుల్లో ఐదు ఫోర్లు మరియు ఒక సిక్సర్తో 87, కెప్టెన్ దినేష్ చండిమాల్ 90 బంతుల్లో ఒక ఫోరు కొట్టి 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా బాంగ్లాదేశ్ బౌలర్లు ముస్తాఫిజుర్ రహమాన్, తైజుల్ ఇస్లాంకు చెరొక వికెట్ లభించింది….