అన్నిదారులూ మూసేస్తున్న మోడీ..బంగారం కూడా కరిగించనున్నాడా..?

Friday, November 25th, 2016, 06:30:41 PM IST

money
ప్రధాని నరేంద్ర మోడీ నల్ల బాబులకు ఉన్న అన్ని దారులను మూసేసే ప్రయత్నం చేస్తున్నాడు.దీనికోసం మోడీ నిన్న జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారని, అవి అత్యంత కఠినమైన నిర్ణయాలని తెలుస్తోంది. మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన నవంబర్ 8 తరువాత దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నగదు డిపాజిట్ లు జరిగాయి.ముఖ్యంగా ప్రగడని మోడీ ప్రారంభించిన జన్ ధన్ ఖాతాల్లోకి దాదాపు రూ 21 వేల కోట్ల డబ్బు దేశవ్యాప్తంగా డిపాజిట్ లు జరిగాయి. ఆ ధనం ఖచ్చితంగా నల్ల ధనమే అయి ఉంటుందని మోడీ భావిస్తున్నారట. దీనితో లెక్కలు లేని అత్యధిక మొత్తంలో డిపాజిట్ లు ధనంపై 60%(30% టాక్స్ మరియు 30% పెనాల్టీ) టాక్స్ విధిస్తే ఎలా ఉంటుంది? అన్న ప్రతిపాదనని మోడీ మంత్రుల ముందు ఉంచారని సమాచారం. ప్రస్తుతం దేశం లో అత్యధికమొత్తంలో డిపాజిట్లు జరుగుతున్న సమయం కాబట్టి కేద్రానికి దీనివలన భారీ ఆదాయం ఉంటుందనేది ఆలోచన.

కాగా నవంబర్ 8 నుంచి ఇప్పటివరకు భారీ స్థాయిలో రూ 21 వేల కోట్ల జన్ ధన్ ఖాతాల్లో జమ కావడం జరిగింది. బ్లాక్ మనీ ఉన్న వారే ఈ డబ్బుని గ్రామాలలోని ప్రజలచే కమీషన్లకు వారిఖాతాల్లో జమ చేయించి నట్లు తెలుస్తోంది. భారీస్థాయిలో డిపాజిట్లు జరుగుతుండడంతో ఐటి శాఖ పరిమితికి మించి డిపాజిట్ లు చేస్తే వారి ఖాతాలపై నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. గతం లో నల్ల ధనం వెల్లడించిన వీరికి కేంద్రం 45 % పన్ను చెల్లిచే పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ దానితో ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. కానీ ఈసారి మాత్రం పన్ను 60 % కు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆదాయపు పన్ను శాఖ లో మార్పులు చేయాలనీ భావిస్తోంది.ఈ నిర్ణయం అమలైతే నల్ల ధనం ఉన్న వారికి మోడీ మరో షాక్ ఇచ్చినట్లే అని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. మరో కఠిన నిర్ణయానికి కూడా మోడీ భారీ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రధాని మోడీ నవంబర్ 8 ప్రకటన తరువాత నల్ల ధనం ఉన్న వారు వారి నల్ల ధనాన్ని రక్షించుకోవడానికి బంగారం షాప్ లమీద పడి కేజీలకు కేజీలు బంగారం కొనేశారు. దీనితో చాలా మొత్తంలో నల్ల ధనం బంగారం రూపంలో మారిపోయిందని వార్తలు వచ్చాయి. వారి బంగారాన్ని కరిగించే ప్లాన్ మోడీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం బంగారం ఇంట్లో దాచుకోవడం పై కూడా పరిమితి విధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనని మోడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మోడీ పెద్దనోట్లని రద్దు చేసి నల్ల దొంగలకు పెద్ద షాక్ ఇచ్చారు. దేశం లో ఉన్న పలు లొసుగులని ఉపయోగించుకుని కొంతమంది నల్ల దొంగలు వారి నల్ల ధనాన్నిరక్షించుకునేశారు.కమీషన్లకు గ్రాలల్లో ఉన్న ప్రజలు పంచడం వార బ్యాంకు ఖాతాల్లో తగు మొత్తం లో జమ చేయించడం వంటివి చేసేశారు. అలాంటి వారికి కూడా షాక్ ఇవ్వాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.