కొత్త నోట్లు కొంప ముంచాయిగా.!

Monday, May 14th, 2018, 02:10:26 PM IST

మీ దగ్గర చినిగిపోయిన బాగా మురికిపట్టిన, ముక్కలైన పాత నోట్లు ఉన్నాయా అయితే మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే అలాంటి నోట్లను ఇకనుండి బ్యాంకు తీస్కోదు అంట. కానీ ఈ రూల్ మాత్రం కొన్ని క్నోట్ల వరకే పరిమితం చేయబడ్డాయి. ఈ మధ్య కొత్తగా వచ్చిన 200, 2000 నోట్లు చినిగిపోతే మాత్రం మార్పిడి చేసుకోవడం కుదరదని తాజాగా వస్తున్న వార్తలు ప్రజలలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీనికి ఓ ముఖ్య కారణం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (నోట్ రీఫండ్) రూల్స్ 2009 ప్రకారం చినిగిపోయిన, ముక్కలైన 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000 నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకునే వీలుంటుంది. అయితే ఈ రీఫండ్ రూల్స్‌లో కొత్తగా వచ్చిన 200, 2000 నోట్లను ఇంకా చేర్చలేదు. ఎందుకంటే ప్రస్తుతానికి కొత్త నోట్ల ప్రింటింగ్ కి సంబంధించి కొన్ని టెక్నికల్ సమస్యలు రావడం వల్ల ఈ నోట్లను మార్పిడి చేసుకునే జాబితాలో చేర్చలేదు అంట. ఈ దెబ్బకి కొత్త నోట్లు చినిగితే ఈ రూల్స్ ప్రకారం బ్యాంకులు వాటిని తీసుకునే అవకాశం లేనట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త 200 నోటును గతేడాది లాంచ్ చేయగా.. 2000 నోటును 2016లో నోట్ల రద్దు వెంటనే ప్రవేశపెట్టారు. కొత్త పది, 50 నోట్లను కూడా ఆర్బీఐ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో మొత్తం రూ.18.43 లక్షల కోట్ల కరెన్సీ ఉండగా.. అందులో 35 శాతం 2000 నోట్లే ఉన్నాయి. ఇప్పటికే రూ.6.7 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు ఉండటంతో వీటి ముద్రణను ఆర్బీఐ నిలిపేసింది. ఇకనుండైనా కకొత్త నోట్లైనా పాత నోట్లైనా జాగ్రత్తగా కాపడ్కోవడం మంచిది. లేదంటే పాత నోట్లను కూడా మార్పిడీ చేసుకునే ప్రమాదం రావచ్చు.

Comments