బ్యాంకులకు వరుసగా 5 రోజుల సెలవు కాదంట, ఇంకా పెంచారా మరి?

Monday, March 26th, 2018, 03:35:38 PM IST

గత కొద్దిరోజులుగా బ్యాంకులకు సెలవులు అంటూ చాలా వార్తలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిదే. అయితే ఈ నెల చివర్లో బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి థామస్ ఫ్రాంకో రాజేంద్ర దేవ్. గురువారం నుంచి సోమవారం వరకు బ్యాంకులు మూతపడే ఉంటాయని ఓ మెసేజ్ సోషల్ మీడియాలో పాకి అది మాదాకా వచ్చింది. దీనిపై ఆయన స్పందించారు. మార్చి 31 (శనివారం)న బ్యాంకులు తెరిచే ఉంటాయి. వరుసగా ఐదు రోజులు సెలవులు అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని రాజేంద్ర దేవ్ స్పష్టంచేశారు. గురువారం మహావీర్ జయంతి.. శుక్రవారం గుడ్‌ఫ్రైడే ఉండటంతో ఆ రెండు రోజులు బ్యాంకులకు సెలవులు. శనివారం తెరిచే ఉంటాయి. ఇక ఏప్రిల్ 2 (సోమవారం)న అకౌంట్స్ క్లోజింగ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అంటే ఐదు రోజుల్లో బ్యాంకులు పనిచేసేది ఒక్కరోజు మాత్రమే. అంటే 5 రోజులు కాస్త 4 రోజులకు చేరింది అంతే