బాప‌ట్ల‌లో ఆయ‌న‌తోనే తేదేపాకు మేలు!

Sunday, September 9th, 2018, 10:03:03 PM IST


జ‌నంలో తిరిగి జ‌నం మ‌నిషి అనిపించుకుంట‌నే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు ద‌క్కేది. ఈ విష‌యంలో ఎవ‌రు స్పీడ్ చూపిస్తే వాళ్ల వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతుంద‌న‌డంలో సందేహం లేదు. గ‌త కొంత‌కాలంగా ఎన్నిక‌ల వేడి రాజుకుపోతోంది. ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన ప్రణాళిక‌ల‌తో జ‌నంలోకి వెళుతూ ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఏపీలో బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కూ ప‌రిశీలిస్తే అక్క‌డ వేగేశ‌న ఫౌండేష‌న్ అధినేత, ఎంఎల్‌సీ వేగేశ‌న న‌రేంద్ర వ‌ర్మ ప్ర‌జాసేవా కార్యక్ర‌మాల్లో ఇత‌రుల‌తో పోలిస్తే దూకుడుగా ఉన్నార‌న్న మాట వినిపిస్తోంది. మంచి నేను సైతం అంటూ ఆయ‌న దూసుకెళుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌జ‌లకు వాట‌ర్ ట్యాంకుల‌తో తాగునీటి స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. పిల్ల‌ల విద్య‌, వృద్ధుల వైద్యం వంటి వాటికి ఆయ‌న ఆర్థిక సాయం చేస్తున్నారు. ప‌లు సేవాకార్య‌క్ర‌మాల్లోనూ ముందుంటున్నారు.

అటు బాప‌ట్ల మున్సిపాలిటీతో పాటు, అక్క‌డ‌ రూర‌ల్‌లోనూ ఆయ‌న పేరు మార్మోగిపోతోంది. 20ఏళ్ల‌లో అస‌లు తేదేపా బాపట్ల‌లో గెలిచిందే లేదు. అయినా అక్క‌డ తేదేపాకు ఇటీవ‌ల ఇమేజ్ పెరిగిందంటే వ‌ర్మ చేసిన ప్ర‌జాసేవా కార్య‌క్ర‌మాల వ‌ల్ల‌నే అన్న ముచ్చ‌టా సాగుతోంది. ఫౌండేష‌న్ పేరుతో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల కోసం కోట్లాది రూపాయ‌ల్ని ఆయ‌న ఖ‌ర్చు చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇక‌పోతే ఇదే చోట మంత్రి గాదె వెంక‌ట‌రెడ్డి, ఆయన త‌న‌యుడిపై ప్ర‌జ‌ల్లో నెగెటివ్ టాక్ ఉంది. అస‌లు ఆ ఇద్ద‌రూ నియోజ‌క వ‌ర్గానికి చేసిందేం లేదని, అస‌లు ప్ర‌జ‌ల‌కు ట‌చ్‌లోనే ఉండ‌ర‌న్న అప‌ప్ర‌ద ఉంది. అందుకే ఈసారి వ‌ర్మ‌కు టిక్కెట్టు ల‌భిస్తే తేదేపా గెలుపుగుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చా సాగుతోంది. ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం వ‌ర్మ‌తో పోటీప‌డుతూ గాదె కుటుంబీకులు చాలానే పాకులాడుతున్నారు. మ‌రి అదృష్టం ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments