తెలంగాణలో సంచలనం రేపుతున్న బతుకమ్మ చీరల రహస్య తరలింపు.!

Sunday, October 28th, 2018, 04:24:11 PM IST

తెలంగాణలోని ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి అని చెప్పాలి.ఇప్పటికే అన్ని పార్టీల వారు తెరాస పార్టీనే లక్ష్యంగా పెట్టుకొని వారిని ఎలా అయినా ఓడించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు.ఇప్పుడు తాజాగా వారికి వరంలాగాను తెరాస నేతలకు శాపం లాగాను ఒక సంఘటన చోటు చేసుకుంది.తెలంగాణా ఆడపడుచులకు ఇచ్చేటువంటి బతుకమ్మ చీరలను ఈ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు రహస్యంగా తీసుకెళ్తున్నారని పసిగట్టిన మహాకూటమిలోని సభ్యులు ఆ అధిక మొత్తంలో ఉన్నటువంటి చీరలు ఉన్న లారీ ని ఆపి మరీ పోలీసులకు అప్పగించారు.

ఇప్పుడు ఈ సంఘటన తెలంగాణా రాష్ట్రంలోని తీవ్ర సంచలనానికి దారి తీసింది.ఖమ్మం జిల్లాలోని బతుకమ్మ చీరల లోడ్ తో వెళ్తున్నటువంటి చీరలను మహాకూటమిలోని కార్యకర్తలు చౌటప్పల్ నుంచి కొత్త గూడెం కు రహస్యంగా బతుకమ్మ చీరలను తరలిస్తుండగా వారు ఆపి పట్టుకున్నట్టు తెలుస్తుంది.అక్కడ లారీ ని ఆపినటువంటి కార్యకర్తలు కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నిరసనలు చేపట్టారు,అంతే కాకుండా ఆ లారీని అక్కడి ఖానాపురం హవేలీ పోలీసు స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తుంది.ఇప్పుడు ఈ సంఘటన తెరాస పార్టీ వారు మీద ఎలా స్పందిస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments