బావా… గెలుపు నీదే… కేటీఆర్

Friday, December 7th, 2018, 05:00:40 PM IST

మన తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ గారు, తన బావ అయిన తెలంగాణా మంత్రి హరీష్ రావు కి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒకరినొకరు పరస్పరం ఎదురై పోలింగ్ కోసం మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా బావకు బామ్మర్ది అడ్వాన్స్ విషెస్ చెప్పారు. “మీకు లక్ష మెజార్టీ ఖాయం బావ అంటూ” బావ కళ్లల్లో ఆనందం నింపారు బామ్మర్ది కేటీఆర్. ఈ ఆసక్తికర సంఘటన సిద్ధిపేట నియోజక వర్గం లో జరిగింది. అనుకోకుండా కలిసిన బావ బామ్మర్దుల మధ్య జరిగిన సంభాషణ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ఆసక్తికరంగా జరిగింది.

హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకుని తన సొంత నియోజకవర్గానికి బయల్దేరిన కేటీఆర్, సిద్ధిపేట నియోజకవర్గంలో పోలింగ్ ని పరిశీలిస్తున్న హరీశ్ రావు అనుకోకుండా ఎదురయ్యారు. గుర్రాల గొంది అనే గ్రామం దగ్గర వీరిద్దరూ కలుసుకున్నారు. దీంతో వీరిరువురు తమ వాహనాలు దిగి పరస్పరం పలకరించుకున్నారు. ఈ సందర్భంగా “బావ కంగ్రాట్స్.. మీకు లక్ష మెజార్టీ ఖాయం”, నేను నా నియోజకవర్గానికి వెళుతున్నా.. మీ మెజార్టీలో సగమైనా తెచ్చుకుంటానంటూ సరదాగా మాట్లాడారు కేటీఆర్.