వీడియో: ఇంటర్వ్యూ చేయబోయి నీటిలో జారిపడిన రిపోర్టర్!

Wednesday, April 11th, 2018, 10:43:22 PM IST

కొన్ని సార్లు న్యూస్ కవరేజ్ కోసం ఎంతగానో ఆకర్షించాలని కొంత మంది రిపోర్టర్లు చేసే పనులు షాకింగ్ కు గురి చేస్తాయి. మరికొన్ని సార్లు హాస్యాస్పదంగా కూడా మారుతుండడం సహజమే. రీసెంట్ గా ఒక రిపోర్టర్ కూడా అదే తరహాలో ఓవరాక్షన్ చేసి నవ్వులపాలయ్యాడు. ప్రముఖ బిబిసి న్యూస్ ఛానెల్ లైవ్ లో ఆ దృశ్యం రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆ న్యూస్ వైరల్ అయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ పై సెటైర్స్ కూడా పడుతున్నాయి.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. బిబిసి న్యూస్ రిపోర్టర్ గోల్డ్‌ కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో భాగంగా ఇంగ్లాండ్ కు చెందిన కొంత మంది స్విమ్మర్లను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లాడు. లైవ్ లో స్విమ్మింగ్ ఫుల్ దగ్గర కాసేపు కూర్చున్న రిపోర్టర్ నీటిలోకి దిగి వారితో మాట్లాడాలని అనుకున్నాడు. అయితే లోపల అడుగును అంచనా వేయకపోవడంతో ఒక్కసారిగా జారిపడ్డాడు. అది చుసిన స్విమ్మర్లు పక్కున నవ్వారు. లైవ్ లో ప్రేక్షకులు కూడా నవ్వేయడంతో స్వారీ అంటూ రిపోర్టర్ తన ఇంటర్వ్యూను కొనసాగించాడు.