షమి ఫిక్సింగ్?.. బయటపడిన నిజం!

Thursday, March 22nd, 2018, 07:16:32 PM IST


గత కొంత కాలంగా టీమ్ ఇండియా క్రికెటర్ మహమ్మద్ షమిపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణితో వివాదాల కారణంగా బిసిసిఐ కూడా షమీ పై విచారణ జరిపించడానికి ఆదేశాలను జారీ చేసింది. అంతే కాకుండా అతని వార్షిక ఒప్పందాన్ని కూడా విచారణ సమయంలో ఆపివేసింది. ఫైనల్ గా ఇప్పుడు బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ విభాగం ఫిక్సింగ్ ఆరోపణలపై సమాధానాన్ని ఇచ్చింది. షమి ఎలాంటి ఫిక్సింగ్ లకు పాల్పడలేదని రుజువయ్యింది. కమిటీ చీఫ్ నీరజ్ కుమార్ స్వయంగా ఆ విషయాన్ని తెలిపారు.

చాలా కాలంగా షమీ భార్య హసీన్ జహాన్ అనేక ఆరోపణలతో షమి కెరీర్ పై అనుమానాలను రేపింది. తనని వేధిస్తున్నాడని చంపాలని చూస్తున్నాడని అలాగే కుటుంబ సభ్యులు కూడా కుట్రలు పన్నారని హాసిన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఫిక్సింగ్ కు పాల్పడినట్లు కూడా ఆమె ఆరోపణలు చేయడంతో ఫైనల్ గా బిసిసిఐ విచారణకు ఆదేశించి షమీ ఎలాంటి ఫిక్సింగ్ కు పాల్పడలేదని ఈ రోజు తెలిపింది. ఇంతకుముందే కొంత మంది క్రికెటర్లు షమీకి మద్దతును ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ధోని షమి ఎలాంటి తప్పు చేయడని తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇక సోషల్ మీడియాలో కూడా నెటిజన్స్ నుంచి షమికి చాలా వరకు మద్దతు అందుతోంది..