కొంప ముంచిన బీసీసీఐ.. క్రికెటర్ల జీతాల పెంపు కథ అడ్డం తిప్పారు…

Friday, March 9th, 2018, 12:17:54 PM IST

తాజాగా భారతీయ క్రికెటర్లకు జీత భత్యాలు పెంచుతున్నామని ఎవరెవరికి ఎంతెంత జీతాలు పెంచుతున్నారో అన్న అంశంపై 2017 అక్టోబర్ నుంచి 2018 సెప్టెంబర్ వరకు ఆటగాళ్లతో కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ, సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీ(సీవోఏ) మధ్య విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరాయి. తమను సంప్రదించకుండా ఆటగాళ్ల జీత భత్యాలకు సంబంధించి నిర్ణయం ఎలా తీసుకుంటారని బీసీసీఐ పెద్దలు ఉవ్వెత్తున ఎగిరిపడుతున్నారు. ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించిన దస్తావీజులపై తాను సంతకం చేయనని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఆగ్రహించారు.

ఈ సందర్భంగా చౌదరి ప్రసంగిస్తూ.. నేను మీకో విషయం కచ్చితంగా చెప్పాలనుకుంటున్నా. జీతాలం పెంపు ప్రతిపాదనకు సంబంధించిన అంశాల్లో నేను భాగస్వామ్యం కాలేదు, నాకు తెలియకుండా తీస్కున్న నిర్ణయం ఇది. మరో విషయం ఏంటంటే.. బోర్డుకు సంబంధించిన ఒక్క అధికారి కూడా ఈ అంశంపై జరిగిన సమావేశంలో పాల్గొనలేదు. సీనియర్ సెలక్షన్ కమిటీ కన్వీనర్ అయినప్పటికీ సమావేశానికి నన్ను ఆహ్వానించకపోగా కనీసం ఎలాంటి సమాచారం కుడా ఇవ్వలేదు. వాళ్లు నా దగ్గరకు వస్తే కాంట్రాక్టులకు సంబంధించిన దస్తావీజులపై సంతకం చేసేదని లేదని స్పష్టం చేశారు.

చౌదరి వ్యాఖ్యలపై స్పందించిన పాలక కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ, బీసీసీఐ ఫైనాన్స్ కమిటీకి మూడుసార్లు(తొలిసారి అక్టోబర్‌లో, చివరిసారిగా ఈఏడాది జనవరి)లో లేఖలు రాసినప్పటికీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆటగాళ్ల ఇన్సురెన్స్ కూడా త్వరలో రెన్యువల్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టుల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. వాస్తవానికి సెలక్టర్లు గత శనివారమే సమావేశమై ప్లేయర్లకు వివిధ గ్రేడ్‌లు ఇచ్చారని వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments