మైండ్ దొబ్బిందా.. ఆసియా కప్ షెడ్యూల్ పై బిసిసిఐ ఆగ్రహం!

Thursday, July 26th, 2018, 04:25:07 PM IST

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ షెడ్యూల్ ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న యూఏఈ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ల కోసం భారత ఆటగాళ్లు కూడా వేచి చూస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన షెడ్యూల్ పై భారత క్రికెట్ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీకు కొంతైనా బుద్ది ఉందా? ఇలాంటి షెడ్యూల్ ని ఎలా తయారు చేస్తారని నిర్వాహకులపై బోర్డు మండిపడింది.

సెప్టెంబర్ 16న భారత్ క్వాలిఫయర్ మ్యాచ్ లో తలపడనుంది. అయితే మరుసటి రోజే పాకిస్తాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ ను నిర్ణయించారు. దీంతో దెబ్బకు బిసిసిఐ కౌంటర్ ఇచ్చింది. షెడ్యూల్ సెట్ చేసుకునే ముందు కొంచెం అయినా కూడా ఆలోచించుకోరా? ఒక్క రోజు గ్యాప్ లేకుండా వెంటనే తదుపరి మ్యాచ్ కు ఒక జట్టు ఎలా సిద్ధమవుతుంది. అందులోను పాకిస్తాన్ తో మ్యాచ్. నిజంగా ఇది అర్ధం లేని ఒక షెడ్యూల్ అని దీనికి ఎంత మాత్రం బిసిసిఐ సమ్మతించని చెబుతూ.. వెంటనే షెడ్యూల్ మార్చాల్సిందిగా బిసిసిఐ ప్రతినిధులు సమాధానమిచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments