‘ఛీర్ లీడర్స్’కు మంగళం పాడిన బీసీసీఐ

Thursday, September 5th, 2013, 06:22:22 PM IST

chir-girls-new

కలర్ ఫుల్ ఎంజాయ్ చేసే క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్. క్రికెట్ లో ఎంటర్ టైన్మెంట్ ను మిక్స్ చేసి మాంచి కలరింగ్ ఇచ్చిన చీర్ లీడర్లు ఇకపై కనిపించకపోవచ్చు. త్వరలో జరిగే ఛాంపియన్స్ లీగ్ లో చీర్ లీడర్లను రద్దు చేస్తే బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ ముందుజాగ్రత్తగా చీర్ లీడర్లకు మంగళం పాడింది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ ఏడాది ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 టోర్నమెంట్ నుంచి ఛీర్ లీడర్లపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 1న కోల్‌కతాలో జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నమెంట్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 6 వరకు మన దేశంలోనే జరుగుతుంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నేర ఆరోఫణలతో ఇప్పటికే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి శ్రీనివాసన్ తప్పుకోవాల్సి వచ్చింది. తాత్కాలిక బీసీసీఐ అధ్యక్షుడిగా నియామకమైన జగ్‌మోహన్ దాల్మియా ‘ఆపరేషన్ క్లీన్’ పేరుతో ఈ చర్యలకు పూనుకున్నాడు.

అయితే ఐపీఎల్-2014తో మొదలవుతుందనుకున్న ఛీర్ లీడర్స్ నిషేధం ఈ ఏడాది ఛాంపియన్స్ లీగ్ నుంచే మొదలైంది. ఈ చర్యపై కొన్ని సూచనలు వచ్చినా ఎవరూ వ్యతిరేకించనట్లు సమాచారం. ఛీర్ లీడర్ల నిషేధంతో ఇక నుంచి ఫోర్, సిక్స్‌‌లు కొట్టినా.. వికెట్ పడినా మనకు మ్యూజిక్ వినపడదు.. డ్యాన్సులు చేసే ఛీర్ గర్ల్స్ కనిపించరు. చీర్ లీడర్లు లేకపోవడంతో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులకు ఎంటర్ టైన్మెంట్ మిస్ అవనుంది.