శ్రీశాంత్ మళ్ళీ క్రికెట్ ఆడనున్నాడా..?

Wednesday, May 16th, 2018, 09:54:32 AM IST

చిన్న వయస్సులోనే క్రికెట్ రంగంలోకి దిగి తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ క్రికెటర్ 2013లో స్పాట్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసాడన్న ఆరోపణల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు అజిత్ చండీలా, అంకిత్ చావాల్ లను కూడా ఈ మ్యాచ్ ఆరోపణల కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా మరో 33 మంది కూడా ఈ కేసులో ఉన్నట్టుగా గుర్తించి వారిపై అభియోగాలు మోపారు. 2013 నుండి 2015 వరకు సాగిన ఈ కేసును పాటియాలా హౌస్ కోర్టు 2015 చివర్లో కొట్టివేసింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఢిల్లీ పోలీసులు హై కోర్టును ఆశ్రయించారు. సుమారు రెండున్నర సంవత్సరాల తరువాత ఇటివల ఈ కేసు విషయమై శ్రీశాంత్ తన లాయర్ల సహాయంతో సుప్రీం కోర్టులో పిటిషన్ పెట్టినట్టు తెలిసింది, కానీ సుప్రీం కోర్టు అతని కేసునుకు నిరాశే ఎదురైందని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే స్రొఇశాన్థ పై ఉన్న జీవితకాల నిషేదాన్ని కొట్టివేసి ఆటను పెట్టుకున్న అభ్యర్థనను ఎలాగైనా స్వీకరించమని కోరగా బీసీసీఐ దాన్ని కూడా తిరస్కరించింది. అదొక్కటే కాకుండా స్కాటిక్ క్రికెట్ లీగ్ ఆడటానికి కూడా అతనికి పర్మీషన్ ఇవ్వబోమని, కనీసం నో ఆబ్జేక్షన్ సర్టిఫికేటు కూడా ఇవ్వడానికి కుదరదు అని చెప్పింది.

చివరికి అన్ని మ్యాచ్ లు ఆడనివ్వకున్నా కనీసం ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఆడటానికి అయినా అనుమతి ఇవ్వాలని శ్రీశాంత్ చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు వాదించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోము అని తేల్చి చెప్పింది. ఈ కేసులో శ్రీశాంత్ తో పాటు వేరే ఇతర క్రికెటర్లు కూడా ఉండటంతో ఈ కేసును వచ్చే జూలై మాసం చివరలోగా క్లియర్ చేయాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. శ్రీశాంత్ చేసిన తప్పుకు ప్రాయశ్చితం ఉంటుందని, మళ్ళీ క్రికెట్ ఆడాలనే అతని తపనని అర్థం చేసుకొని స్సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పింది. కానీ అప్పటివరకూ కొంచం వేచి చూడాల్సిందే తప్ప అంతకు మించి చేసేదేమీ లేదని హాయ్ కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆద్వర్యంలో తీర్పునివ్వడం జరిగింది.

Comments