అద్భుత ఘట్టానికి టీం ఇండియా సన్నద్ధం..అతిరధులందరికి ఆహ్వానం !

Friday, September 16th, 2016, 11:30:16 AM IST

sachin-dravid-gangoli
భారత క్రికెట్ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది.టెస్టుల్లో టీం ఇండియా అరుదైన మైలురాయికి చేరువ కాబోతోంది.ఈ నెల 22 న కాన్పూర్ లో భారతజట్టు న్యూజిలాండ్ తో సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ ను ఆడనుంది.ఈ మ్యాచ్ భారత్ కు 500 వ టెస్ట్ మ్యాచ్.దీనితో ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వేడుకలా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

ఈ మ్యాచ్ కోసం ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.ఇందులో భాగంగా మాజీ కెప్టెన్లందరిని ఈ మ్యాచ్ కు ఆహ్వానించనుంది.ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా’500 వ టెస్ట్’ ముద్రించిన వెండి నాణెంతో టాస్ వేయనున్నారు.ఎప్పటికి ఈ మ్యాచ్ గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ సందర్భంగా బీసీసీఐ విందుని ఏర్పాటు చేయనుంది. ఈ విందులో టీం ఇండియా, న్యూజిలాండ్ జట్టు సభ్యలు, మాజీ కెప్టెన్లు పాల్గొననున్నారని తెలుస్తోంది.సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్, గంగూలీ, ద్రావిడ్ వంటి ప్రముఖులందరూ ఈ మ్యాచ్ కు హాజరు కానున్నారు.