బిసిసిఐది స్వార్ధ పూరిత ఆలోచన : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్!

Thursday, May 17th, 2018, 02:16:16 AM IST

గత కొద్దీ సంవత్సరాలుగా జరుగుతున్న ఐపీఎల్ కు మన దేశంలోని ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన వస్తున్న విషయం అందరికి తెలిసిందే. పొట్టి క్రికెట్ గా 20ఓవర్లు మాత్రమే వుండే ఈ మ్యాచ్ లు త్వరగా ముగియడం దీని ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. అంతేకాదు బ్యాట్స్ మాన్ పరుగులు కూడా చాలా వేగంగా చేసే ఈ ఫార్మట్ క్రికెట్ కి ముందు టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్ లు ఉండేవి. అయితే ఈ పొట్టి క్రికెట్ రాకతో ప్రేక్షకులు పెద్దగా వన్డేల పై దృష్టి పెట్టడం లేదు. ఇక టెస్ట్ ల పరిస్థితి అయితే మరింత ఘోరం. కొందరు మాజీ క్రికెటర్లు అయితే ఐపీఎల్ వంటి క్రికెట్ ఫార్మాట్ ల వల్ల టెస్ట్ క్రికెట్ చనిపోతోందని విమర్శించారు.

ఇక నేడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా ఈ విషయమై బిసిసిఐ పై ధ్వజమెత్తారు. ఇటీవల తమజట్టుతో భారత జట్టును టెస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఆహ్వానించగా దానిని బిసిసిఐ తిరస్కరించడం పై ఆయన మండిపడ్డారు. ఒకవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలు టెస్ట్ క్రికెట్ ను బ్రతికించాలని చూస్తుంటే బిసిసిఐ వద్దు అనడం ఒక స్వార్ధపూరిత నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఇండియా జట్టులో ప్రస్తుతం మంచి బ్యాట్స్ మాన్, బౌలర్, అల్ రౌండర్ లతో కూడిన మంచి లైన్ అప్ ఉందని అయినప్పటికీ వారు ఎందుకు వద్దనుకుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు.

ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ల లో టెస్ట్ క్రికెట్ కు ఆదరణ ప్రస్తుతం పెరుగుతోందని ఇటీవల ఆస్ట్రేలియాలోని ఒక రేడియో ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. కాగా ఆయన జాతీయ సెలెక్టర్ పదవి నుండి తప్పుకుని కామెంటేటర్ గా స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఇదివరకు ఇండియన్ మాజీ ప్లేయర్ రవిశాస్త్రి ఇటీవల డే అండ్ నైట్ టెస్ట్ లపై మాట్లాడుతూ, డే అండ్ నైట్ టెస్ట్ లు ఆడటం ఆసక్తికరంగా ఉంటుందని, అయితే అందుకు గాను ఆటగాళ్లకు 18నెలల సాధన అవసరమని అన్నారు. అందుకే బిసిసిఐ ఈ ప్రతిపాదనను వద్దనుకున్నట్లు సెలెక్టర్లు చెపుతున్నారు. ఇక ఇండియా జట్టు ఈ నవంబర్ నుండి జనవరి మధ్య వరకు ఆస్ట్రేలియా టూర్ చేయనుంది. ఈ టూర్ లో 4 టెస్ట్ లు , 3 వన్డేలు, 3 టీ 20లు ఆడనుంది……