బి అలెర్ట్ : తిరుపతిలో నిఫా వైరస్?

Sunday, June 3rd, 2018, 01:36:49 PM IST

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నిఫా వైరస్ అన్ని దేశాల ప్రజలను భయ కంపితులను చేస్తోంది. ఇప్పటికే కేరళలోని ఒక కుటుంబం మొత్తం ఈ వైరస్ బారిన పడి మరణించిన విషయం తెలిసిందే. నిఫా భయంతో అక్కడిప్రజలు కూడా వణికిపోతున్నారు. వారి మరణాల తర్వాత కేరళకు వెళ్లాలంటేనే పర్యాటకులు భయపడుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ వైరస్ ఆంధ్రకు పాకిందని, ఇటీవల కేరళ నుండి తిరుపతి వచ్చిన కేరళ వైద్యురాలు ఒకరికి ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో చేరితే, డాక్టర్లు పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు నిఫా వైరస్ సోకిందని తేల్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా ఈ భయంకరమైన వైరస్ కు మందులేదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని, గబ్బిలాలు, కొన్ని రకాల పక్షులనుండి ఈ వైరస్ ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెపుతున్నారు.

మరీ ముఖ్యంగా పండ్లు వంటివి అక్కడక్కడా కొరికి ఉన్నట్లు కనపడితే వాటిని అస్సలు తినకూడదని, అలానే పండ్లు కొనుగోలు చేసాక వాటిని బాగా నీటితో శుభ్రం చేసి అప్పుడు తినాలని చెపుతున్నారు. మాంసాహారం కూడా తినకుండా ఉంటే మంచిదని వారు సూచిస్తున్నారు. ఇటీవల ఈ వైరస్ కు ఆస్ట్రేలియాలో మందును కనుగొన్నారని అంటున్నారు. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదగాని ప్రస్తుతం తిరుపతి పట్టణ ప్రజలు ఆందోళనతో ఉండడంతో, అధికారులు మాత్రం అధికారికంగా నిఫా వైరస్ తో ఎవరు చనిపోయినట్లు అధరాలు లేవని, కావున ప్రజలు భయబ్రాంతులకు గురి కావద్దని అంటున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments