భర్తలు.. జర భద్రం..!

Thursday, August 9th, 2018, 06:30:21 PM IST

సంసారం అనే జీవితంలో భార్య భర్తలు ఇద్దరు అర్ధం చేసుకొని ముందుకు సాగితేనే ఒక కుటుంబం బావుంటుంది. ఎన్ని కష్టాలున్నా భార్య సహనంతో.. భర్త బాధ్యతగా వ్యవహరిస్తే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు తప్పటడుగు వేసినా కూడా అది వారి ఒక్కరిపైనే ప్రభావం చూపదు. పసి పిల్లల జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాగే పెళ్లి చేసిన ఇరుకుటుంబాల పెద్దల్లో ఎంతో మనోవేదన మొదలవుతుంది. ఈ విషయాలు అందరికి తెలిసినవే. తప్పటడుగులు వేసేవారికి కూడా తెలియనివి కావు. కాకపోతే అలాంటి వాటి గురించి పెద్దగా ఆలోచించకుండా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితంలో మాసిపోలేని మచ్చను మిగులుస్తాయి.

ఎక్కడా లేని విధంగా భారత సంస్కృతిలో మహిళలకున్న గౌరవం చాలా ప్రత్యేకం. కంప్యూటర్ కాలంలో కూడా భర్త కట్టిన తాళికి విలువ ఇస్తున్నారు అని విదేశీ కవులు సైతం పొగిడారు. ఇప్పటికి అలాంటి అపురూపమైన స్త్రీలున్నారు. కానీ కొందరు మహిళలు చేస్తున్న పనులకు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మల్లెపువ్వులాంటి మనస్సుల్లో మరణాన్ని కూడా భయపెట్టే ఆలోచనలు కలుగుతున్నాయి. తాళి కట్టిన భర్త ఎన్ని కొట్టినా సహించే గుణం గలవారు కూడా చేయాలనీ పనులు తప్పటడుగు వేస్తున్న మహిళలు చేయడం గమనార్హం. అక్రమ సంబంధాల ఉచ్చులో పడి కొందరు భర్తను కడతేరుస్తున్నారు.

ఇటీవల కాలంలో జరిగిన ఘటనలు చూస్తుంటే దాంపత్య జీవితం దారి తప్పుతోందా అనే అనుమానం కలుగుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు. పెళ్లయిన రెండు రోజులకే భర్తను చంపేసిన భార్యల లిస్టు ఈ మద్యే ఎక్కువగా పెరుగుతోంది. ఆ లిస్టు చెప్పుకుంటూ పోతే సమాయం సరిపోదు. ఇక ఒక మహిళ అయితే ఏకంగా భర్త స్థానంలో ప్రియుడిని ఉంచాలని ప్లాన్ వేసిన తీరు దేశంలో వైరల్ గా మారింది. భర్తను హతమార్చి అతని స్థానంలో ప్రియుడిని ఉంచాలని మొహం గుర్తుపట్టకుండా యాసిడ్ పోసింది. ఎక్కువగా అక్రమ సంబంధాలే భర్తల పాలిట శాపంగా మారుతోంది. రీసెంట్ గా నగరంలో అలాంటి ఘటనే అనేక చర్చలకు దారి తీస్తోంది.

భర్త మందలించి సర్దుకుపోయినప్పటికీ భార్య మాత్రం ప్రియుడితో కలిసి కఠిన నిర్ణయం తీసుకుంది. బొద్దింకలను చంపే హిట్ స్ప్రే కొట్టి అతని ప్రయివేట్ పాట్స్ ను నులిమేసింది అంటే ఆమె ఆలోచన తీరు ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడికి రాని మర్డర్ ఆలోచన బార్యలకే ఎక్కువగా వస్తోందని అర్ధమవుతోంది.

ఇక అక్రమ సంబంధాల కారణంగా క్షణికావేశంలో భార్యలను చంపిన భర్తలు చాలా మంది ఉన్నారు. ఏ తప్పు లేకున్నా కూడా స్త్రీలపై పైషాచికంగా దాడి చేసి హతమార్చే రాక్షసులు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు కొందరు మహిళలు కూడా రాక్షసత్వంగా ఆలోచించడం కలవరపెడుతోంది. సున్నితంగల వారి మనస్సులో ఇలాంటి కఠిన నిర్ణయాలు ఎందుకు వస్తున్నాయనేది చెప్పడం కష్టమే. సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలపై అనేక కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా “భర్తలు.. జర భద్రం” అనే పదం వైరల్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments