బ్రేకింగ్ న్యూస్ : బెర్ముడా ట్రైయాంగిల్ రహస్యం తెలిసిపోయింది….!!

Friday, August 3rd, 2018, 02:10:54 PM IST

కొన్నేళ్ల క్రితం నుండి ప్రపంచవ్యాప్తంగా వున్న ఎందరో శాస్త్రవేత్తలకు సైతం కనిపెట్టలేని అతి పెద్ద మిస్టరీ గా మారిన బెర్ముడా ట్రైయాంగిల్ రహస్యాన్ని ఛేదించడం పెను సవాలుగా మారింది. అయితే ఎట్టకేలకు ఎన్నో ఏళ్ళ తరువాత ప్రస్తుతం దాని రహస్యాన్ని కొందరు శాస్త్రవేత్తలు ఛేదించినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆంగ్ల ఛానల్, ఛానల్ 5 ఈ రహస్య ఛేదనకు సంబంధించి శాత్రవేత్తలు చేసిన ప్రయోగాల ద్వారా ఒక డాక్యుమెంటరీ ని రూపొందించి మరీ ఆ రహస్యాన్ని తెలిపింది. విషయం ఏమిటంటే, అసలు బెర్ముడా ట్రైయాంగిల్ ప్రాంతానికి చేరుకోగానే ఏ వాహనమైనా ఎలా అదృశ్యమై ఏమైపోతుందో తెలియకపోవడానికి ప్రధాన కారణం ఏలియన్లు, కృష్ణబిలాలు లేదా ఏదైనా అదృశ్య శక్తా అనేది కాదని కేవలం అలలే నని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే అవి మనం సముద్ర మట్టం వద్ద చూసే సాదాసీదా అలలు కావని వాటిని ‘రోగ్ వేవ్స్’ అంటరాని చెపుతున్నారు.

ఈ రోగ్ వేవ్స్ సాధారణ అలల వేగం మరియు ఎత్తుతో పోలిస్తే కొన్ని వందలరెట్లు వేగం మరియు సాంద్రతను కలిగివుంటాయని చెప్తున్నారు. వారు చెప్తున్నా ప్రకారం అట్లాంటిక్ సముద్రంలోని మయామి, సాన్ యువాన్, ప్యూర్టో రికో మధ్యన గల 7లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి బెర్ముడా ట్రైయాంగిల్ అని పేరు. అప్పటివరకు ఎంతో ప్రశాంతంగా వుండే అక్కడి వాతావరణం, ఒక్కసారిగా తీవ్ర మహోగ్ర రూపం దాల్చి ఒక్కసారిగా అలలు ఎగసిపడడం జరుగుతుందని, ఇక చుట్టుప్రక్కల నుండి చుట్టుముట్టే పెనుతుపానులు కూడా తోడవడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం మృత్యుకుహరంలా తయారవుతుందని, ఆ సమయంలో అక్కడి చేరుకునే ఓడలు మరియు విమానాల వంటివి ఏవి కూడా వాటి ధాటికి తట్టుకోలేవని అంటున్నారు.

ఎంతలా అంటే అలలు 100 నుండి 120 అడుగులు పైకి ఎగసిపడి ఒక్కసారిగా తీర్వ ఒత్తిడిని ప్రేరేపిస్తాయని ఆ సమయంలో ఎంతటివారికైనా ప్రాణ భయంకలుగక మనదని అంటున్నారు. ఇన్నేళ్ళలో ఇప్పటివరకు దాదాపు 75కు పైగా విమానాలు మరియు లెక్కలేనన్ని ఓడలు ఈ బెర్ముడా ట్రైయాంగిల్ లో చిక్కుకుని ఆచూకీ లేకుండాపోయాయని, ఈ రకమైన ప్రమాదాల వల్ల ఇప్పటివరకు దాదాపుగా 1000 మందికి పైగా మృత్యువాత పడ్డట్లు శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కాగా వీటినుండి బయటపడడం దాదాపుగా సాధ్యం కాదని, మనం ఎలాబయటపడాలా అని అనుకునేలోపే జరగవలసిన నష్టం జరిగిపోతుందని వారు అంటున్నారు. ఇంతటి మహమ్మారి అలలజోలికి వెళ్లకుండా జాగ్రత్త వహించి, ఇకపై అక్కడకు వెళ్లి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు….