వీడియో : ఫుట్ బాల్ మ్యాచ్లో ఎలుగుబంటి హాల్ చల్

Wednesday, April 18th, 2018, 12:17:48 AM IST

రష్యా ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా థర్డ్ డివిజ‌న్‌ మ్యాచ్‌కు ఓ ఎలుగుబంటి ముఖ్య అతిథిగా హాజరైంది. మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ వ్యక్తితో వచ్చిన ఎలుగుబంటి ప్రేక్షకులను కొద్దిసేపు అలరించింది. దీనిపేరు టిమ్. తన విచిత్రమైన చేష్టలతో అక్కడున్నవారంతో సరదగా నవ్వుకున్నారు. ఈ సందర్భంగా తనకాళ్లపై నిలబడి తన రెండు చేతులు పైకెత్తి చప్పట్లతో అభిమానులను ఉత్సాహపరిచింది. తనతో వచ్చిన వ్యక్తి ఎలా చెబితే అలా చేసింది. చివరికి ఫుట్‌బాల్‌ను తన చేతులతో మ్యాచ్ రిఫరీకి అందజేసింది. మ్యాచ్ ఆడేందుకు ఫీల్డ్‌లో ఉన్న ఆటగాళ్లు సైతం సంబరపడిపోయారు.

ఐతే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో నిర్వాహకులకు పెద్దచిక్కొచ్చిపడింది. నోరులేని జీవాలను ఇలా జనాల మధ్యకు తీసుకొచ్చి ఇబ్బంది పెడతారా అని కొందరు జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఫిఫా వరల్డ్‌కప్ జరగనున్న రష్యాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని మరికొంతమంది అభిమానులు నిర్వాహకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2018లో జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలకు రష్యా ఆతిథ్యమిస్తోన్న విషయం తెలిసిందే. వచ్చే జూన్ 14 నుంచి జులై 15 వరకు రష్యాలోని 11 ప్రధాన నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments