బిజెపి నియంతృత్వ విధానాల వల్లనే ఆ ఫలితాలు : నారా లోకేష్

Friday, June 1st, 2018, 12:14:08 PM IST

ఓవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరూ సుభిక్షంతో, మంచి ఆర్ధిక పరిస్థితిలో హాయిగా వున్నారని చెపుతున్నారు. కానీ మరోవైపు చూస్తుంటే బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ పాలనను చాలావరకు వ్యతిరేకిస్తున్నట్లు ఇటీవల కొన్ని సర్వే లు చెపుతున్నాయని, దీనికి ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఏమిటంటే, బీజేపీ తాము పరిపాలిస్తున్న రాష్ట్రాలకేమో నిధులు ఎప్పటికప్పుడు అందిచడం, అలానే బిజెపియేతర రాష్ట్రాలకేమో సరైన రీతిలో నిధులు మంజూరు చేయకపోవడమేనని పలు ప్రాంతీయ పార్టీలు అంటున్నాయి. కాగా నిన్న పలురాష్ట్రాల్లో ప్రకటించిన ఎన్నికల ఫలితాలలో బిజెపి దాదాపు చాల చోట్ల ఖంగుతిండడం వారి నియంతృత్వ, ఆధిపత్య పోకడల వల్లనే ఆలా వచ్చాయని ఏపీ ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన నేడు సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఈ ఫలితాలపై ట్వీట్ చేసారు.

ఏపీకి న్యాయం చేస్తామనిచెప్పి దుష్పరిపాలన, కుట్రలు కుతంత్రాలతో బిజెపి నేతలు మనకు తీరని ద్రోహం చేసారని, అసలే ఎన్నో సమస్యల మధ్య విడిపోయిన రాష్ట్రం కావడం, అందునా నూతన రాజధాని అభివృద్ధికి సరిపడా నిధులు లేకపోవడం తెలిసి కూడా బిజెపి నేతలు కేంద్రంలో చూస్తూ ఉండి కూడా చలించకపోవడం బాధాకరం అని అన్నారు. ఇప్పటికే దక్షిణాదిన ఆ పార్టీ పని చాలావరకు అయిపోయిందని, ఇక ఉత్తరాది వాసులకు ఇకపై మొహం కూడా చూపించే అవకాశం లేకుండా చేసుకున్నారని అన్నారు. కాబట్టి ఇకనైనా ఆంధ్రప్రదేశ్ లోని బిజెపి నేతలు కేంద్రానికి సలాములు మానేసి ఇక్కడ ప్రజల సమస్యలు, రావలసిన నిధులపై పోరాటం చేస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు వారిని నమ్మే పరిస్థితి కొంతైనా వస్తుందని ఆయన అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments