ఆవిడ వల్లనే చంద్రబాబు సంక్రాంతి పండుగకు సొంత ఊరు వస్తున్నారట !

Wednesday, January 17th, 2018, 10:40:14 AM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా అది తానే చేసినట్లు గట్టిగా చెప్తుంటారని కొందరు ఆయన పై కామెడీగా జోకులు వేయడం అక్కడక్కడా చూస్తుంటాం. నిజానికి చంద్రబాబు అమరావతి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో కూడా ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చాలానే వున్నాయని చెప్పడం లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఆయన సంక్రాంతి పండుగ ను కుటుంబం తో కలిసి సరదాగా గడపడానికి సొంత ఊరు చిత్తూర్ జిల్లాలోని నారావారిపల్లె విచ్చేసారు. ఒకప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితం తనను సంక్రాంతికి సొంత వూరు వెళ్లి వేడుకలు జరుపుకుందామని ఆయన సతీమణి భువనేశ్వరి అడిగారని అయితే కుదరడు అని ఆయన గట్టిగా చెప్పేవారట.

అయితే తర్వాత ఒకసారి సంక్రాంతికి తమ సొంత వూరు వచ్చిన ఆయన కొన్ని ఇబ్బందులు వున్నా సర్దుకు పోయేవారట, తర్వాత ప్రతి సంక్రాంతికి ఇక్కడకు రావడం అలవాటుగా మారిందని, ఈ విషమై పూర్తి క్రెడిట్ ఆయన సతీమణికి దక్కుతుందని చెప్పుకొచ్చారు. పండుగ సంబరాలు ముగించుకుని మంగళగిరికి తిరుగు పయనమయిన ఆయన అక్కడ ప్రెస్ మీట్ లో భాగం గా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధి కోసం యువత అమెరికా, ఆస్ట్రేలియా, బెంగుళూరు వంటి చోట్లకు వెళ్తున్నారని, అలా వెళ్లిన వారు పెద్ద పండుగైన సంక్రాంతి పండుగకు తిరిగి తమ సొంత ఊళ్లకు రావడం వల్ల నగరాలు ఖాళి అవుతున్నాయని, తద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుదలకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా సంక్రాంతికి సొంత ఊరుకి వెళ్లే సంప్రదాయం తమ ద్వారానే మొదలయిందని చెప్పే చంద్రబాబు, ఆ క్రెడిట్ని తన సతీమణికి ఇవ్వడం గొప్ప విషయమని విశ్లేషకులు అంటున్నారు….