మహిళా రైల్వేస్టేషన్‌గా మారిన బేగంపేట రైల్వే స్టేషన్…

Thursday, March 8th, 2018, 03:54:19 PM IST

మహిళా దినోత్సవం సంధర్బంగా బేగంపేట రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ మహిళా రైల్వేస్టేషన్‌గా ప్రకటించారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని ఫిరంగిపురం, విద్యానగర్ స్టేషన్లను మహిళా రైల్వేస్టేషన్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో 27 మంది మహిళా ఉద్యోగినులను కేటాయించినట్లు జీఎం తెలిపారు. ఇకనుండి మహిళలు టిక్కెట్ల తనిఖీ, స్టేషన్ భద్రత, పారిశుద్ధ్యంలో విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. ఎంఎంటీఎస్ నడుపుతున్న మహిళను జీఎం వినోద్‌కుమార్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. మహిళా దినోత్సవంనాడు ఇలాంటి శుభవార్త వినడం చాలా ఆనందకరంగా ఉందని స్టేషనులోని మహిళా ఉద్యోగులు అన్నారు.