ముందస్తు ఎన్నికలు: అసలు ప్లాన్ ఇదేనా?

Friday, September 7th, 2018, 08:43:54 AM IST

మొన్నటి వరకు ముందస్తు ఎన్నికల హడావుడి గురించి వార్తలే తప్ప ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. ఇక మొత్తానికి కేసీఆర్ సమావేశాలను రద్దు చేసి తీసుకున్న నిర్ణయంతో అందరిలో ఒక క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ గెలుస్తుందని గతంలో ప్రతిపక్ష నేతలే బల్ల గుద్ది చెప్పారు. కానీ కాలం అధికార పక్షంలో ఊహించని భయాన్ని రేపిందని మళ్ళీ అదే ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు. అందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

కానీ మొత్తానికి కేసీఆర్ ఇచ్చిన ట్విస్ట్ కి ఇతర పార్టీల నేతలకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపడానికి అసలు కారణం ప్రతిపక్షాలకు ఏ మాత్రం సమయం ఇవ్వకూడదని కేసీఆర్ ఈ తరహాలో ప్లాన్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఇంకా పూర్తి ఎన్నికలకు ఏ మాత్రం సిద్ధం కాలేదు.

నియోజకవర్గ స్థానాల్లో ఎమ్మెల్యే క్యాండేట్ లను ఫైనల్ చేయాల్సి ఉంది. కాంగ్రెస్ కూడా కేసీఆర్ మాదిరిగానే సర్వేలను నిర్వహించి నాయకుల లిస్టు తయారు చేసింది. ఆ లిస్టు గురించి చర్చలు జరిపే లోపే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు అంటూ షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వీలైనంత త్వరగా తన పార్టీ సభ్యుల పేర్లను జనాలకు తెలియజేయాలి. వారికి సమయం చాలా తక్కువ ఉందనే చెప్పాలి. అసలే ఆ అపార్టీలో నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయని టాక్ వస్తోంది. కొన్ని సార్లు ఋజువయ్యింది కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments