సినీ నటినైనందుకు గర్వంగా ఉంది… ‘కొత్త బీజేపీ ఎంపీకి పంచ్’

Tuesday, March 13th, 2018, 03:29:57 PM IST

‘తనకు కాకుండా ఒక సినిమా డాన్సర్‌కు టికెట్ ఇచ్చారు’ అని జయాబచ్చన్‌పై కొత్తగా పార్టీలో చేరిన బీజేపీ నేత, ఎంపీ నరేష్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలా చేసిన వ్యాఖ్యలకు సుష్మా స్వరాజ్ కుడా మొట్టికాయలు వేసింది. ఇదిలాగుంటే ఈ మాటలను జయా తిప్పి కొట్టారు. సినీ నటిగా చేస్తున్నందుకు తాను ఎంతో గర్వపడతున్నానని, చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఉన్నందుకు సంతోషంగా ఉందని ఆవిడ మాట్లాడారు. సమాజ్ వాది పార్టీ తనను రెండో సారి రాజ్యసభకు ఎన్నుకోవడంపై ఆవిడ హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి, పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి, ప్రజలకి నేను చేసిన సేవలు గుర్తుంచుకొని నన్ను రెండో సారి ఎన్నుకున్నందుకు చాలా సంతోషం అన్నారు.

ఈ సందర్భంగా జయ ప్రసంగిస్తూ ఇతరులు తనపై చేసే కామెంట్లను తాను పట్టించుకోనని, సమాజ్‌వాది పార్టీ మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని దాని ఎల్లా వేళలా కాపాడుకుంటూ గౌరవిస్తానని అన్నారు. తనకు రెండో సారి అవకాశం కల్పించడం కూడా మహిళల పట్ల సమాజ్‌వాది పార్టీకున్న ప్రాధాన్యమేనని ఆవిడ పేర్కొన్నారు. అయితే సమాజ్‌వాది మాజీ నేతైన నరేష్ అగర్వాల్ జయపై కామెంట్స్ చేయడం ఇది ఐదో సారి. ఈ విషయాన్ని గుర్తు చేసిన జయా గతంలోనూ ఇలాంటివి తాను పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఏనుగును చూసి శునకాలు అలాగే అరుస్తాయని ప్రతీదానికి అనవసరంగా వాదోపవాదాలు పెట్టుకోవడం సరికాదని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments