కొంచెం అతి అనిపించట్లేదా బెల్లంకొండ..?

Tuesday, November 13th, 2018, 07:19:30 PM IST

కెరీర్ ప్రారంభించటంతోనే బారి బడ్జెట్ సినిమాతో ప్రారంభించి, అందరి దృష్టిని ఆకర్షించిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తర్వాత కూడా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి బారి బడ్జెట్ సినిమాలు తీస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను కొత్త దర్శకుడు శ్రీనివాస్ మావిళ్ల దర్శకత్వంలో చేసిన సినిమా కవచం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో అంతా బాగానే అనిపిస్తుంది కానీ హీరో సాయి శ్రీనివాస్ నటన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా డైలాగ్ డెలివరీ, మోడ్యులేషన్స్ తో సహా అల్లుడుశ్రీనులో ఎలా ఉందొ అలాగే అనిపించింది. తన నటన మీద ఏ మాత్రం కాన్సెన్ట్రేట్ చేయని బెల్లంకొండ, ప్రతీ సినిమా స్టార్ హీరోయిన్లు, బారి సెట్టింగులు, కోట్లు పెట్టి హీరోయిన్ లతో ఐటెం సాంగ్స్ చేయిస్తూ, బారి బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు.

తాజాగా కవచం చిత్రానికి సంబంధించి టీజర్ లంచ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ బెల్లంకొండ “ఈ సినిమా చేయడానికి ముందు చాలానే కథలు విన్నా, చాలా అంటే సుమారు 50కథల వరకు విని ఉంటాను. వాటిల్లో బాగా నచ్చి ఈ కవచం కథను ఎంచుకున్నాం,విన్న కథలన్నీ నేను నాన్న కలిసి ఫిల్టర్ చేసాం” అన్నారు. ఈ మాటలు అందరిని షాక్ కి గురి చేసాయి,సాక్ష్యం తర్వాత నెల రోజులు మాత్రమే గ్యాప్ తీసుకున్న ఈ హీరో ఏకంగా 50 కథలు వినటం ఏంటి, అతి కాకపోతే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 6 నెలలు ఖాళీగా ఉన్న హీరోలకే అన్ని కథలు వినటం సాధ్యం కాదని అంటున్నారు.