ఇండియాలో అత్యంత నమ్మకమైన కంపెనీలు ఇవే!

Thursday, April 19th, 2018, 08:01:30 AM IST

అత్యంత విశ్వసనీయ కంపెనీల విషయంపై టీఆర్‌ఏ (టెలీ కమ్యునికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ) ఇటీవల నిర్వహించిన సర్వేలో శాంసంగ్ కంపెనీయే అగ్రస్థానంలో నిలిచింది. శాంసంగ్‌ కంపెనీకి భారత్‌లో ఎంతగా ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటికే వీరు మొబైల్స్, టివిలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషిన్ లు తదితర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలకు మన భారత దేశంలో మంచి ఆదరణ వుంది. అయితే తిఆర్యే ఈ సర్వేను 16 నగరాల్లో, మొత్తం 2,450 మంది నిర్వహించారు. భారత్‌ ఆయా బ్రాండ్‌ల విశ్వసనీయతలో శాంసంగ్‌ తరువాత సోనీ, ఎల్‌జీ, టాటా, యాపిల్‌ సంస్థలు ఉన్నాయి.

వీటిల్లో టాటా మాత్రమే భారత్‌కు చెందిన సంస్థ. ఆ తరువాతి స్థానాల్లో డెల్‌, హోండా, నైకీ, హ్యూవ్‌లెట్‌ ప్యాకార్డ్‌, మారుతి సుజుకి ఉన్నాయి. గతేడాది కన్నా ఈ సారి 320 కొత్త బ్రాండ్లు టాప్‌ 1000లో స్థానం దక్కించుకున్నాయి. ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ విభాగంలో పెప్సీ మొదటిస్థానంలో నిలిచింది. అయితే ఇందులో గమ్మత్తయిన విషయం ఏమిటంటే మన దేశీయులు ఎక్కువగా ఇతర దేశాల ఉత్పత్తులకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే. బ్రాండ్ ఈజ్ బ్రాండ్ అంతేగా మరి……

  •  
  •  
  •  
  •  

Comments