ప్రీమియర్ షో టాక్ : భాగమతి

Friday, January 26th, 2018, 10:33:01 AM IST

అనుష్క సౌత్ లో క్రేజీ హీరోయిన్. అగ్ర హీరోల సరసనే కాకుండా, సోలో హీరోయిన్ గా కూడా అనుష్క దూసుకుపోతోంది. బాహుబలి వంటి భారీ ఘనవిజయం తరువాత అనుష్క నటించిన చిత్రం భాగమతి. అనుష్క సోలో హీరోయిన్ గా ఇది వరకే తన టాలెంట్ చూపించింది. అరుంధతి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ట్రైలర్, కొన్ని ప్రచార చిత్రాలు విడుదలయ్యాక భాగమతి చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా నేడు విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షోలు యూఎస్ లో పడ్డాయి. భాగమతిగా అనుష్క మెప్పించిందా లేదా ఇప్పుడు చూద్దాం..

అనుష్క ఈ చిత్రంలో చెంచల, మరియు భాగమతి గా రెండు పాత్రల్లో కనిపిస్తుంది. ఇంటర్వెల్ సన్నివేశంలో భాగమతి ఎంట్రీ ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అనుష్క చెంచలగా కనిపిస్తుంది. చెంచల చుట్టూ జరిగే దర్యాప్తు సన్నివేశాలు, భాగమతి బంగ్లా ఆసక్తిని రేపుతాయి. ఇంటర్వెల్ లో భాగమతి ఎంటర్ అయ్యాక సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరిగిపోతాయి. భాగమతిగా అనుష్క అద్భుతంగా నటించింది. ఎలాంటి పాత్రలో అయినా తాను ఒదిగిపోతానని అనుష్క మరో మారు నిరూపించింది. దర్యాప్తు సన్నివేశాలని ఎక్కువసేపు సాగదీసిన తరువాత చిత్ర కథ రీవీల్ అవుతుంది. కథ పరంగా ఆలోచిస్తే చిత్రం ప్రేక్షుకులు ఆశించిన స్థాయిలో లేదు అని చెప్పొచ్చు. కానీ అనుష్క నటన, బ్యాక్ గ్రౌండ్ సంగీతం మెస్మరైజ్ చేస్తాయి. బాగమతి బంగ్లా సెట్, మిగిలిన ఆర్ట్ వర్క్ బావున్నాయి. మొత్తంగా భారీ అంచనాలతో వచ్చిన భాగమతి పరవాలేదనిపించే విధంగా ఉందని చెప్పొచ్చు.