భైరవగీత ట్రైలర్: ఒక్కొక్కర్నీ సంటిపిల్లల్లా గుక్కపట్టి ఏడ్చేలా చేద్దాం!

Saturday, September 1st, 2018, 03:41:40 PM IST

‘ఎవర్నీ ఇడిసిపెట్టొద్దు.. ఏడిపిద్దాం.. ఒక్కొక్కర్నీ సంటిపిల్లల్లా గుక్కపట్టి ఏడ్చేలా చేద్దాం.. వాళ్ల రక్తంతో ఈ సీమకు అభిషేకం చేద్దాం’ అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో అందరిని ఆకట్టుకున్న ట్రైలర్ భైరవగీత. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను సిద్దార్థ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. సినిమా మేకింగ్ స్టైల్ ఏంటో ట్రైలర్ చాలా క్లారిటీగా చెప్పేసింది. వార్మ తరహాలో పోలికలు కనిపిస్తున్నాయి. వర్మతో తో పాటు అభిషేక్ పిక్చర్స్ కూడా సినిమా నిర్మాణంలో భాగమైంది.

నిజ జీవిత ఆధారంగా ఒక ప్రేమ కథను తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా చెబుతున్నారు. ఒక ప్రేమ కోసం కథానాయకుడు సమాజాన్ని ఎదుర్కోవడం వంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. డైలాగ్స్ ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో సినిమాను చూపిస్తూ రక్త పాతం వంటి సన్నివేశాలతో చిత్రం ఓ వర్గం వారిని బాగా ఆకర్షిస్తోంది. ‌‘మనం సంపమంటే సంపనీకి.. మన కోసం సావనీకి కాకుంటే వాళ్ల బతుకులు యాదానికనుకుంటున్నావు’ అని మొదట్లోనే డైలాగ్ ఆకర్షించింది. ఇక లాస్ట్ లో వచ్చే ముద్దు సీన్ కూడా సినిమాపై అంచనాలను రేపుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments