భారత్ బంద్.. అంత లేదిక్కడ ..!

Monday, November 28th, 2016, 12:11:05 PM IST

barat-bandhh
దేశ వ్యాప్తంగా విపక్షాలు పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ భారత్ బంద్ ను నిర్వహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పూర్తిగా కనిపిస్తున్నా, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బంద్ ప్రభావం అంతంత మాత్రం గానే ఉంది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ వంటి వారు భారత్ బంద్ ని వ్యతిరేకిస్తున్నారు.కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారత్ బంద్ నామ మాత్రంగానే సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వైసిపి, సిపిఎం, సిపిఐ లు రోడ్ల మీదకు వచ్చి ఆనందోళనలు చేశాయి. కాగా కాంగ్రెస్ పార్టీ నేతలు తాము బంద్ లో పాలుపంచుకోబోమని ఆక్రోస్ దిన్ గ నిరసనలు చేపడతామని ప్రకటించారు.

బంద్ కు పిలుపు నిచ్చిన విపక్షాలు బ్యాంకింగ్ సేవలు, అత్యవసర సేవలకు మొనహాయింపుని ఇచ్చాయి. దీనితో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తున్నాయి. ఆర్టీసీ కూడా నడుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. హైదరాబాద్ లోని ఆర్బీఐ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ వంటి సీనియర్ నేతలు పాల్గొనన్నారు. ఇక విజయవాడ లో జనసేన కార్యకర్తలు ఆదోళన నిర్వహించారు. ప్రజలను కరెన్సీ కష్టాలనుంచి బయట పడేయాలని వారు డిమాండ్ చేశారు.అక్కడక్కడ చైనా పాటి ఆదోళనలు మినహా తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రభావం లేదు.