భారత హాకీ జట్టు జైత్రయాత్రకు బ్రేక్

Sunday, September 1st, 2013, 08:30:25 PM IST

sports

కప్ గెలవాలని అనుకున్న భారత్ హాకీ క్రీడాకారుల ఆశలు అడియాశలయ్యాయి. ‘ఆసియా కప్ ఫైనల్’ లో భారత్ పరాజయం చెందింది. మలేషియాలో జరిగిన మ్యాచ్ లో 4-3 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా విజయం సాధించింది. ఇప్పటికే ప్రపంచకప్ కు భారత్ అర్హత సాధించిన విషయం తెలిసిందే. లీగ్ దశలో కొరియా ఆటగాళ్లను నిలువరించిన భారత్.. ఫైనల్ ఫోబియా అధిగమించడంలో మాత్రం విఫలమై భారంగా స్వదేశానికి పయనం కానుంది. వరుస మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ ట్రోఫీని తీసుకువస్తారని భావించిన భారత అభిమానులు నిరాశ చెందక తప్పలేదు.

2007 చెన్నైలో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచి ఆ తర్వాత ఘోరంగా విఫలమైన భారత జట్టు పరిస్థితి తిరిగి గాడిలో పడింది. గతేడాది టోర్నీలో ఏడో స్థానంలో నిలిచిన భారత్‌కు ఈసారి కప్ గెలిచే సువర్ణావకాశం దక్కినా రన్నరప్ గానే సరిపెట్టుకున్నారు. అనుభవం లేకున్నా నిలకడమైన ఆటతీరుతో కుర్రాళ్లు అదరగొట్టారు. లీగ్ దశలోనే కొరియాపై 2-0తో గెలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపినా చివరకు ఫైనల్ లో పరాజయం చెందింది.