భరత్ కు తమిళ ప్రేక్షకుల బ్రహ్మరధం ?

Sunday, June 3rd, 2018, 01:16:39 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా తెలుగులో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 200 కోట్ల వసూళ్ల వరకు అందుకుంది. శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ తరువాత మహేష్ – కొరటాల శివ ల కాంబినేషన్ లో వచ్చిన భరత్ కూడా బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో ఈ కాంబినేషన్ కు క్రేజ్ పెరిగింది. ఇక ఈ చిత్రాన్ని మే 31న తమిళంలో భరత్ ఎన్నం నాన్ పేరుతొ విడుదలైన ఈ సినిమాకు అక్కడ తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మొదటి రోజే భారీ వసూళ్లను అందుకుంది. కోలీవుడ్ లో మహేష్ అంటే మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ తో పాటు తమిళ వెర్షన్ కూడా క్రేజ్ తెచ్చుకోవడం విశేషం. తమిళనాడు లో భారీగా విడుదలైన ఈ సినిమా రెండో రోజుకు థియేటర్స్ కూడా పెంచడం విశేషం. మహేష్ సరసన ఖైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

  •  
  •  
  •  
  •  

Comments