బ్రేకింగ్ అండ్ బ్లాస్టింగ్ : మొత్తం 300 మంది.. ఉగ్ర‌వాదుల్ని లేపేసిన భార‌త్ ఆర్మీ..!

Tuesday, February 26th, 2019, 10:50:34 AM IST

పుల్వామా ఉగ్రదాడికి సర్టికల్ స్ట్రయిక్‌తో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దీంతో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై కోలుకోలేని దెబ్బ పడింది.

మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో బార‌త్ ఆర్మీ జ‌రిపిని ఈ స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌లో దాదాపు 300 వంద‌ల‌మంది ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్టు తెలుస్తోంది.

పాక్ ఆక్ర‌మిత కశ్మీర్‌లోని ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలైన బాలాకోట్, ముజ‌ఫ‌రాబాద్ శివార్ల‌లో, జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా భార‌త వైమానికి ద‌ళం దాడులు జ‌రిపింది.

కార్గిల్ యుద్ధ విమానం త‌ర్వాత ఈ దాడులు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. ఈ దాడుల్లో భాగంగా జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిబిరాల్లోని యూనిట్ల పై 200ల‌కు పైగా బాంబుల‌ను జార‌విడించింది.

ఈ క్ర‌మంలో భారత్ విమానాలు ఎల్ఓసీ వాస్త‌వాధీన రేఖ‌ను దాటినట్లు ఇప్పటికే పాక్ ప్రకటించింది. ఈదాడుల్లో అతిపెద్ద జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరం ధ్వంసమయింది.