ఫ్లాష్ ఫ్లాష్ : భీమవరం ఫైనల్ సర్వే రిపోర్ట్ అవుట్..!

Sunday, May 19th, 2019, 02:59:39 PM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో అత్యంత కీలకంగా మారిన నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం కూడా ఒకటి.ఎందుకంటే అక్కడ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో పాటుగా అక్కడ వైసీపీ పార్టీ నుంచి కూడా గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల బరిలో ఉండడంతో అక్కడ గెలుపు రెండు పార్టీల శ్రేణులు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు.దీనితో అక్కడ ఫలితాలు ఎలా రానున్నాయి అన్నది చాలా ఆసక్తికరంగా మారింది.

తాజాగా అక్కడ ఫలితాలు ఎలా వస్తాయో అన్న విషయంపై లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అక్కడ పవన్ పోటీ చేస్తాను అని చెప్పక ముందు నుంచి వైసీపీ కి ఎదురు లేని విజయం వస్తుంది అని అంతా అనుకున్నారు కానీ పవన్ పోటీ అక్కడ నుంచి ఉంటుంది అని తెలియడంతో ఒక్కసారిగా అక్కడ రాజకీయ సమీకరణాలు అన్ని మారిపోయాయి.దీనితో ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.

కానీ ఈ సర్వే రిపోర్టు ప్రకారం ఈ ఇద్దరి మధ్య భీకర పోరు తప్పదని కానీ అక్కడి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం గ్రంథి శ్రీనివాసే గెలుస్తారని అధికంగా స్థానికులు భావిస్తున్నట్టు తేలింది.అంతే కాకుండా స్థానికులు కూడా పవన్ గెలుపు కంటే గ్రంథి శ్రీనివాసే గెలుపొందుతారని వేలల్లో బెట్టింగులు కూడా కాస్తున్నారట.దీనితో అక్కడ గెలుపు అవకాశాలు వైసీపీ అభ్యర్థికే ఎక్కువ ఉన్నాయని ఆ సర్వేలో వెల్లడైంది.కానీ పవన్ ను కూడా అక్కడ తక్కువ అంచనా వెయ్యడానికి లేదు.మరి ఈ గట్టి పోటీలో అసలు విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.