ఏవి సుబ్బారెడ్డి పై ఫైర్ అయిన భూమా మౌనిక!

Friday, April 27th, 2018, 05:51:11 PM IST

ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గం లో ప్రస్తుతం ఇరువర్గాల పోరు టిడిపికి, అలానే ఆ పార్టీ నేతలకు పెను సమస్యగా మారాయి. ఓ వైపు ఏవి సుబ్బా రెడ్డి, మరో వైపు భూమా కుటుంబం. నిజానికి ఒకప్పుడు భూమాకు మంచి అనుచరుడైన ఏవి, ఆయన మరణాంతరం తాను విడిగా తెలుగుదేశం చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల గత కొద్దిరోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య విబేధాలు తార స్థాయికి చేరడం చూస్తున్నాం. కొద్దిరోజుల క్రితం సుబ్బారెడ్డి చేపట్టిన సైకిల్ యాత్రపై రాళ్ల జరగడంతో, అది అఖిల ప్రియా వర్గమే చేయించిందని ఆయన ఆరోపించారు. అయితే అంత చౌకబారు రాజకీయాలు చేయవలసిన అవసరం తమకు లేదని భూమా అఖిలప్రియ వర్గం తేల్చి చెప్పింది.

కాగా ఈ విషయమై సుబ్బారెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా చంద్రబాబు నేడు అఖిలప్రియ వర్గాన్ని వివరణ కోసం అమరావతి పిలిపించారు. ఆమె తో పాటు అమరావతి వచ్చిన అఖిల ప్రియా సోదరి నాగమౌనిక, ఏవి సుబ్బారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఇప్పుడు నిండు నెలలతో వున్నా గర్భిణిని అని, ఏవి సుబ్బారెడ్డి చిన్నప్పటినుండి తెలుసునని, నాన్న ఆయన్ని ఇంట్లో మనిషిగా చూసేవారని చెప్పింది. అఖిలప్రియపై బురదచల్లుతున్న సుబ్బారెడ్డి ఆమె వొట్టి అఖిల ప్రియకాదని, భూమా అఖిల ప్రియా అనే విషయాన్నీ గుర్తుపెట్టుకోవాలి అన్నారు. ఇన్నాళ్లు తాము చాలా సహనంగా ఉన్నామని, ఆయన రాజకీయంగా ఎదగడం కోసం మమ్మల్ని బలిపశువుల్ని చేస్తే చూస్తూ ఇకపై సహించేది లేదని గట్టిగా చెప్పారు.

తమకు ఆళ్లగడ్డ, నంద్యాల తల్లి తండ్రులవంటివి అని , తమపై నిందలు వేస్తే అక్కడి ప్రజలు సుబ్బారెడ్డికి తగిన బుద్ధి చెపుతారని అన్నారు. మా అక్క భూమా అఖిలప్రియ భూమా నాగిరెడ్డి కూతురు, ఎస్వీ సుబ్బారెడ్డి మనవరాలు, ఎస్వీ మోహన్‌రెడ్డి మేనకోడలు. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి చెల్లెలు అనే విషయాన్ని మరిచిపోకూడదు. అఖిలను టచ్‌ చేయాలంటే ముందుగా భూమా కుటుంబాన్ని టచ్‌ చేయాల్సి ఉంటుంది అని తీవ్రంగా మాట్లాడారు.నేను ప్రణాళికలు రచిస్తే భూమా ప్రజల్లోకి వెళ్లేవారని చెపుతున్న సుబ్బారెడ్డి మరి ఎందుకు నంద్యాలలో ఓడిపోయారని ప్రశ్నించారు. మా తల్లితండ్రులు రాజకీయ జీవితంలో ఎన్నో ఏళ్లుగా వున్నారు.

అటువంటి వారిపై బురద చల్లడం బాధాకరమని, అయినా సుబ్బారెడ్డి యాత్ర చేస్తుంటే రాళ్ల దాడి చేయించేంత నీచ స్థితిలో తాము లేమన్నారు. అయినా పోలీస్ లు తమ వర్గం పై కేసులు పెడితే విచారణకు సహకరిస్తాం అని చెప్పాము అన్నారు. అసలు గంగుల, ఇరిగేలా కుటుంబాలతో తనకు స్వతహాగా ఎటువంటి విబేధాలు లేవని సుబ్బారెడ్డి చెప్పడంతోనే ఆయన అసలు స్వరూపం ఏంటో బయటపడుతోంది ఆమె అన్నారు. కాబట్టి ఇకనైనా తమ కుటుంబంపై, అఖిల ప్రియపై సుబ్బారెడ్డి వర్గం నిందారోపణలు చేయకుంటే మంచిదని అన్నారు. ఓ వైపు ముఖ్యమంత్రితో సమావేశం ఉండగా, ఏవీ సుబ్బారెడ్డిని హెచ్చరిస్తూ నాగమౌనిక చేసిన వాఖ్యలు కలకలం రేపుతున్నాయి…..

  •  
  •  
  •  
  •  

Comments