వైయ‌స్ జ‌గ‌న్ సోద‌రిగా భూమిక‌?

Tuesday, May 22nd, 2018, 10:21:09 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, దివంగ‌త వై.య‌స్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత‌క‌థ‌ను వెండితెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. యాత్ర అనేది టైటిల్. మ‌హి.వి.రాఘ‌వ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైయ‌స్సార్‌ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి న‌టిస్తున్నారు. విజ‌య‌మ్మ పాత్ర‌లో బాలీవుడ్ న‌టి అశ్రిత న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌తి పాత్రా దేనిక‌దే ప్ర‌త్యేక‌మైన‌వి. వైయ‌స్ సీఎంగా కాక‌ముందు చేప‌ట్టిన‌ పాదయాత్ర స‌మ‌యంలో అత‌డి కుమారుడు జ‌గ‌న్‌, కుమార్తె ష‌ర్మిల ఆ యాత్ర‌లో కీల‌క పాత్రలు పోషించారు. నాన్న‌ను ముఖ్య‌మంత్రిగా చూసుకోవాల‌న్న క‌సితో ఆ ఇరువురు ఎంత‌గానో శ్ర‌మించారు. అయితే ఇదంతా పెద్ద తెర‌పై ఎలివేట్ చేయాలంటే అందుకు త‌గ్గ పాత్ర‌ధారులు దొర‌కాలి. ఆ క్ర‌మంలోనే ఆయా పాత్ర‌ల కోసం స్టార్ల‌ను వెతికి ప‌ట్టుకుంటున్నాడు మ‌హి.వి.రాఘ‌వ్‌.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ష‌ర్మిల పాత్ర‌కు సీనియ‌ర్ న‌టి భూమిక‌ను ఎంపిక చేసార‌ని తెలుస్తోంది. భూమిక ఇప్ప‌టికే బాలీవుడ్‌లో ఫేమ‌స్‌. ఇటీవ‌లే `ధోనీ` బ‌యోపిక్ లో న‌టించడం వైయ‌స్ సినిమాకి అస్సెట్ కానుంది. అలానే వైయ‌స్‌ జ‌గ‌న్ పాత్ర‌లో త‌మిళ హీరో సూర్య న‌టిస్తార‌న్న ప్ర‌చారం ఎలానూ ఉంది. ఇక‌పోతే వైయ‌స్ ఫ‌స్ట్‌లుక్ కి స్పంద‌న బావుంది. త‌దుప‌రి ఇత‌ర పాత్ర‌ల లుక్ ఏవైనా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రిలీజ్ చేస్తారేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments